Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రైళ్లలో 92 కోచ్‌లు పెరిగాయ్
ABN , Publish Date - Jul 12 , 2024 | 09:11 PM
జనరల్ బోగీల్లో ప్రయాణించే వారి సౌకర్యార్థం భారతీయ రైల్వే(Indian Railways) సుదూర ప్రాంతాలకు వెళ్లే 46 రైళ్లలో 92 కొత్త జనరల్ కేటగిరీ కోచ్‌లను పొడగించింది.
ఢిల్లీ: జనరల్ బోగీల్లో ప్రయాణించే వారి సౌకర్యార్థం భారతీయ రైల్వే(Indian Railways) సుదూర ప్రాంతాలకు వెళ్లే 46 రైళ్లలో 92 కొత్త జనరల్ కేటగిరీ కోచ్‌లను పొడగించింది. ఈ మేరకు రైల్వే శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
బెంగుళూరు సిటీ బెలగావి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్ హుబ్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ముంబయి బెంగళూరు ఉదయన్ ఎక్స్‌ప్రెస్, ముంబయి అమరావతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ గౌహతి లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్, గౌహతి జమ్ము తావి ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్లలో కోచ్‌లు పెరిగాయ్. మరో 22 రైళ్లలో కూడా త్వరలో జనరల్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.
పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 2024-25, 2025-26లో మరో 10 వేల నాన్-ఏసీ కోచ్‌లను తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవలే ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) 4,485 నాన్-ఎసీ, 2025-26లో మరో 5,444 కోచ్‌లను ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. భారతీయ రైల్వే 2,605 జనరల్ కోచ్‌లను తయారు చేయడానికి సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. వీటిలో అమృత్ భారత్ జనరల్ కోచ్‌లు కూడా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి..
ఏపీ తెలంగాణల్లో నడిచే 12 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనంగా జనరల్ బోగీలు పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సింహపురి, గోదావరి, గౌతమి, ఫలక్‌నుమా, చార్మినార్, కొకనాడ, విశాఖ, కొండవీడు, భాగ్యనగర్ - కాకినాడ, కాకినాడ - షిర్డీ, కాకినాడ - ఎల్టీటీ రైళ్లకు 2 అదనపు జనరల్ బోగీలు, మచిలీపట్నం - ధర్మవరం రైలుకు ఒక బోగీని యాడ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ రైళ్లలో ఇప్పటికే రెండు జనరల్ బోగీలు ఉండగా.. నవంబర్ నుంచి 4 కోచ్‌లతో ఇవి నడవనున్నాయి.
For Latest News and National News