Amit shah: ఉత్తరాయణ్ మహోత్సవ్‌లో పతంగం ఎగురవేసిన అమిత్‌షా
ABN , Publish Date - Jan 14 , 2024 | 08:52 PM
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గుజరాత్ లోని గాంధీనగర్‌లో ఆదివారం జరిగిన ఉత్తరాయణ్ పతంగ్ మహోత్సవ్‌లో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా పతంగం ఎగురవేశారు. అహ్మదాబాద్‌లోని జగన్నాథ స్వామి ఆలయాన్ని సైతం దర్శించి ప్రత్యేక పూజలు జరిపారు.
గాంధీనగర్: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah) గుజరాత్ (Gujarat)లోని గాంధీనగర్‌లో ఆదివారం జరిగిన ఉత్తరాయణ్ పతంగ్ మహోత్సవ్ (Uttarayan Patang Mahotsav)లో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా పతంగం ఎగురవేశారు. అహ్మదాబాద్‌లోని జగన్నాథ స్వామి ఆలయాన్ని సైతం దర్శించి ప్రత్యేక పూజలు జరిపారు.
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశంలో తొలిరోజైన మకర సంక్రాంతి నాడు సూర్యభగవానునికి ప్రత్యేక ప్రార్థనలు చేయడం అనవాయితీ. పొంగల్, బిహు, మాఘి తదితర పేర్లతో మూడురోజుల పాటు పండుగ సంబరాలు జరుపుకొంటారు. గుజరాత్‌లోని పండుగ తొలిరోజును ఉత్తరాయన్‌గా పిలుస్తారు. అంతర్జాతీయ పతంగుల పండుగను కూడా గుజరాత్ పేరుగాంచింది. సూర్యభగవానునికి ప్రభాత ప్రార్థనలు చేసిన అనంతరం ప్రజలు ఎంతో ఉత్సాహంగా రంగురంగుల పతంగాలు ఎగురువేస్తూ సంబరాల్లో మునిగితేలుతారు.