Constitution Debate: భావ ప్రకటనా స్వేచ్ఛను హరించిన నెహ్రూ, ఇందిర
ABN , Publish Date - Dec 17 , 2024 | 08:51 PM
భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యసభలో చేపట్టిన ప్రత్యేక చర్చలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ 55 ఏళ్ల పాలనతో 77 సార్లు రాజ్యాంగాన్ని సవరించిందన్నారు.
న్యూఢిల్లీ: మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ హయాంలో భావ ప్రకటనా స్వేచ్ఛకు కళ్లెం వేశారని, ప్రజా హక్కులను అణగదొక్కారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. భావప్రకటనా స్వేచ్ఛకు కళ్లెం వేస్తూ జవహర్‌లాల్ నెహ్రూ రాజ్యాంగ సవరణ తెస్తే, 24వ సవరణను ఆయన కుమార్తె ఇందిరాగాంధీ తెచ్చారని తెలిపారు. 1971 నవంబర్ 24న భారత పౌరుల ప్రాథమిక హక్కులను కుదించే హక్కు పార్లమెంటుకు ఇచ్చారని షా చెప్పారు. భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యసభలో చేపట్టిన ప్రత్యేక చర్చలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ 55 ఏళ్ల పాలనతో 77 సార్లు రాజ్యాంగాన్ని సవరించిందన్నారు.
Prashant Kishor: పీకే పార్టీకి గట్టి దెబ్బ.. కోర్ కమిటీకి మాజీ ఎంపీలు గుడ్‌బై
ఈవీఎంలపై కాంగ్రెస్, విపక్ష పార్టీలు చేసిన ఆరోపణలను అమిత్‌షా తిప్పికొట్టారు. దీనిపై పలు పిటిషన్లను సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టివేసిందని, విపక్ష పార్టీలు ఓటపోయినప్పడల్లా ఈవీఎంలపై ఫిర్యాదులు మొదలుపెడతారని విమర్శించారు. స్వాంతంత్ర్య వచ్చినప్పటి నుంచి భారతదేశం సాగించిన ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ, భారతదేశం ఐక్యంగా ఉండటం, ఆర్థిక స్వావలంభన సాధించడంపై అంతర్జాతీయ పరిశీలకు ఒకప్పుడు అనుమానాలు ఉండేవన్నారు. దేశ పటిష్టత, భారతదేశం అంతర్జాతీయ శక్తిగా నిలబడేందుకు సర్దార్ పటేల్ చేసిన అవిశ్రాంత కృషి శ్లాఘనీయమని చెప్పారు. గత 75 ఏళ్లలో అనేక దేశాలు స్వాంతంత్ర్యం సాధించి కొత్త జర్నీ సాగించినప్పటికీ అక్కడ ప్రజాస్వామ్యం విజయవంతం కాలేదన్నారు. కానీ భారత ప్రజాస్వామ్యం ఎన్నడూ లేనంతంగా బలంగా వేళ్లూనుకుని పటిష్టంగా ఉందన్నారు. ఒక్క బొట్టు రక్తం కూడా చిందకుండా ఎన్నో మార్పులు చేయగలిగామని, దేశ ప్రజలు అహంకార పూరితులైన నియంతలను ప్రజాస్వామ్యబద్ధంగానే చెల్లాచెదురు చేశారని అన్నారు.
రాహుల్‌పై విమర్శలు
భారతదేశం ఆర్థికంగా తనకాళ్లపై తాను నిలబడలేదని మాట్లాడిన వారికి దేశ ప్రజలు, రాజ్యంగం సరైన సమాధానం చెప్పాయని షా అన్నారు. ఈరోజు ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక శక్తిగా భారత్ నిలిచిందని, బ్రిటిన్‌ను వెనక్కి నెట్టామని గుర్తుచేశారు. తనను తాను యువకుడిగా పిలిపించుకనే 54 ఏళ్ల నేత ఒకరు రాజ్యాంగాన్ని చేతితో పట్టుకుని భారత రాజ్యంగాన్ని బీజేపీ మార్చేస్తోందంటూ తిరుగుతున్నారని రాహుల్‌ను ఉద్దేశించి పరోక్షంగా షా విమర్శించారు. రాజ్యాంగాన్ని సవరించే ప్రొవిజన్ రాజ్యాంగంలోనే ఉందని, బీజేపీ 16 ఏళ్ల పాలనలో 22 సవరణలే చేసిందని, 55 ఏళ్ల పాలించిన కాంగ్రెస్ 77 సవరణలు చేసిందని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల సంఖ్యను పెంచేశారని ఆరోపించారు. తమకు ఒక్క బీజేపీ ఎంపీ ఉన్నా మతం ఆధారంగా రిజర్వేషన్లను అనుమతించేది లేదని అమిత్‌షా నిష్కర్షగా చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Priyanka Gandhi: నిన్న పాలస్తీనా, నేడు బంగ్లా బ్యాగ్
Kasturi: గర్భాలయంలోకి ఎవరికీ ప్రవేశం లేదు..
Ajit Doval: చైనా పర్యటనకు అజిత్ ఢోబాల్
For National News And Telugu News