Kashmir: సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్ల కలకలం.. ఆర్మీ దళాలు ఏం చేశాయంటే
ABN , Publish Date - Feb 16 , 2024 | 12:05 PM
జమ్మూ కశ్మీర్(Jammu Kashmir) సరిహద్దులో పాకిస్థాన్ మళ్లీ కవ్వింపు చర్యలకు దిగింది. సరిహద్దులోని వివిధ ప్రాంతాలపై నిఘా పెట్టడానికి దాయాది దేశం డ్రోన్లను ఎగరవేయడం కలకలం రేపింది.
జమ్మూ: జమ్మూ కశ్మీర్(Jammu Kashmir) సరిహద్దులో పాకిస్థాన్ మళ్లీ కవ్వింపు చర్యలకు దిగింది. సరిహద్దులోని వివిధ ప్రాంతాలపై నిఘా పెట్టడానికి దాయాది దేశం డ్రోన్లను ఎగరవేయడం కలకలం రేపింది. నియంత్రణ రేఖ(LoC) వెంట వీటిని గుర్తించిన సరిహద్దు భద్రతాదళ సిబ్బంది క్వాడ్‌కాప్టర్లను నేలకూల్చారు. బాల్నోయ్ - మెంధార్, గుల్పూర్ సెక్టార్లలో మరికొన్ని డ్రోన్లు ఎగిరాయని వారు తెలిపారు.
క్వాడ్‌కాప్టర్ల ద్వారా ఆయుధాలు లేదా మాదక ద్రవ్యాలను జారవిడవకుండా చూసేందుకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు వివరించారు. పూంచ్ జిల్లాలో డ్రోన్లు ఎగిరినట్లు తెలిపారు. ఫిబ్రవరి 12 న, మెంధార్ సెక్టార్‌లోని మాన్‌కోట్ ప్రాంతంలో శత్రు డ్రోన్ కదలికలను గుర్తించి ఆర్మీ దళాలు దానిపై కాల్పులు జరిపాయి.
జమ్మూ కశ్మీర్‌లో మాదక ద్రవ్యాలు, ఆయుధాలను చేరవేసేందుకు పాకిస్థాన్ డ్రోన్‌లను ఉపయోగిస్తోంది. పాక్ డ్రోన్ల సమాచారం ఎవరికైనా తెలిస్తే.. పోలీసులకు సమాచారం అందించాలని భద్రతా దళ సిబ్బంది తెలిపారు. సమాచారం అందించిన వారికి ఇప్పటికే రూ.3 లక్షల నగదు బహుమతి ప్రకటించారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి