Share News

Arvind Kejriwal: జైలులో కిలో బరువు పెరిగిన కేజ్రీవాల్

ABN , Publish Date - Apr 10 , 2024 | 07:52 PM

లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చక్కటి ఆరోగ్యంతో ఉన్నట్టు జైలు వర్గాలు బుధవారంనాడు తెలిపాయి. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందన్న వార్తలను అధికారులు తోసిపుచ్చారు.

Arvind Kejriwal: జైలులో కిలో బరువు పెరిగిన కేజ్రీవాల్

న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ (Liquor Policy)కి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) చక్కటి ఆరోగ్యంతో ఉన్నట్టు జైలు వర్గాలు బుధవారంనాడు తెలిపాయి. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందన్న వార్తలను అధికారులు తోసిపుచ్చారు. డయాబెటిస్‌కు రోజువారీ వైద్య పరీక్షలు జరుగుతున్నాయని, షుగర్ లెవెల్స్ నిలకడగా ఉన్నాయని చెప్పారు.


''అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 1న జైలుకు వచ్చినప్పుడు జరిగిన ఆరోగ్య పరీక్షల్లో ఆయన బరువు 65 కిలోలుగా ఉంది. ఏప్రిల్ 7న ఆయన బరువు 66 కిలోలకు చేరుకుంది. షుగర్స్ లెవెల్స్ నిలకడగా ఉన్నాయి. మొత్తంగా ఆయన మంచి ఆరోగ్యంతో ఉన్నారు'' అని జైలు వర్గాలు తెలిపాయి. కాగా, కేజ్రీవాల్ షుగర్స్ లెవెల్స్ పడిపోతున్నట్టు ఆప్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 160గా ఉందని, నార్మల్ బ్లడ్ షుగర్ ఇన్ ఫాస్టింగ్ 70 ఉందని తెలిపింది. ఇందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్‌ను కూడా షేర్ చేసింది. తీహార్ జైలులో కేజ్రీవాల్ నాలుగున్నర కిలోల బరువు తగినట్టు ఇటీవల 'ఆప్' ఆరోపించింది. దీనిని తీహార్ జైలు అధికారులు తోసిపుచ్చారు. కేజ్రీవాల్ జైలుకు వచ్చినప్పుడు 65 కిలోలు ఉన్నారని, ప్రస్తుతం కూడా అంతే బరువు ఉన్నారని వివరణ ఇచ్చారు.

AAP: కేజ్రీవాల్‌కు షాక్.. 'ఆప్' మంత్రి రాజీనామా


జైలు నుంచి మరో సందేశం పంపిన కేజ్రీవాల్

కాగా, జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ తన భార్య సునీతా కేజ్రీవాల్ ద్వారా మరో సందేశాన్ని ఆప్ నేతలకు పంపారు. ఢిల్లీ ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం, ఆప్ శ్రేణులు నిరంతరాయ సేవలందించాలని కేజ్రీవాల్ కోరారు. రాజ్యంగ పరిక్షణే లక్ష్యంగా ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని 'సంవిధాన్ బచావో..తనషాహీ హఠావో' దినంగా పాటించాలని పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 10 , 2024 | 07:58 PM