Kejriwal: కోర్టులో కేజ్రీవాల్ ఉద్వేగభరిత ప్రసంగం.. ఈడీపై సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Mar 28 , 2024 | 04:39 PM
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కస్టడీని పొడగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరో నాలుగు రోజులు కస్టడీ పొడగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. కేసు విచారణ సందర్భంగా కోర్టులో కేజ్రీవాల్ ఉద్వేగభరిత ప్రసంగం చేసినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కస్టడీని పొడగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరో నాలుగు రోజులు కస్టడీ పొడగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. కేసు విచారణ సందర్భంగా కోర్టులో కేజ్రీవాల్ ఉద్వేగభరిత ప్రసంగం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈడీపై పలు ప్రశ్నలు సంధించారు కేజ్రీ. గురువారం ఉదయమే కోర్టును ఆశ్రయించేందుకు కేజ్రీవాల్‌కు అనుమతి లభించింది. ఈ క్రమంలో ఆయన ఈడీపై సంచలన ఆరోపణలు చేశారు. ఈడీ తనను, తన పార్టీని అణచివేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.
ఏ కోర్టు కూడా తనను దోషిగా గుర్తించలేదని పేర్కొన్నారు. ‘‘నన్ను అరెస్ట్ చేశారు. కానీ ఏ కోర్టు కూడా నన్ను దోషిగా నిరూపించలేదు. సీబీఐ 31 వేల పేజీల ఛార్జిషీట్ దాఖలు చేయగా, ఈడీ 25 వేలపేజీలు దాఖలు చేసింది. వాటిని కలిపి చదివినా నన్ను ఎందుకు అరెస్టు చేశారనే ప్రశ్న మిగిలిపోయింది" అని కేజ్రీవాల్ కోర్టులో వాదించారు. ఆయన్ని కోర్టులో హాజరుపరిచినప్పుడు ఆప్ మంత్రులు అతిషి, గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్‌తో పాటు ముఖ్యమంత్రి సతీమణి సునీత కేజ్రీవాల్ కోర్టులో ఉన్నారు.
జరిగిందిదే..
మద్యం కేసులో కేజ్రీ కస్టడీ పొడిగిస్తూ స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులిచ్చారు. మరోవైపు.. తన అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర ఉందని కేజ్రీవాల్ ఆరోపించారు. తన అరెస్ట్ ఒక రాజకీయ కుట్ర అని, రాబోయే ఎన్నికల్లో దీనికి ప్రజలే సమాధానం చెప్తారని అన్నారు. కేజ్రీవాల్‌ను (Kejriwal Arrest) మార్చి 21వ తేదీన అరెస్ట్ చేయగా, 28వ తేదీ వరకు ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. తనని అరెస్ట్ చేశాక.. ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈడీ తనని అక్రమంగా అరెస్ట్ చేసిందని, తక్షణమే ఉపశమనం కలిగించాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే.. ఢిల్లీ హైకోర్టు ఆయనకు మధ్యంతరం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అందుకు బదులుగా.. కేజ్రీవాల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా న్యాయస్థానం ఈడీకి ఏప్రిల్ 2వ తేదీ వరకు సమయం ఇచ్చింది. ఏదేమైనా.. ఓ విషయంలో మాత్రం కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రిగా తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని స్పష్టం చేసింది. అంతేకాదు.. న్యాయపరంగా ఉన్న అడ్డంకులు ఏంటని పిటిషనర్‌ను ప్రశ్నించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి