Arvind Kejriwal: ఢిల్లీ కొత్త సీఎం ఎవరు?.. నేడు ప్రకటించనున్న కేజ్రీవాల్
ABN , Publish Date - Sep 17 , 2024 | 10:34 AM
ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. తన రాజీనామా నేపథ్యంలో.. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కొత్త సీఎం అభ్యర్థిని అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇవాళే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు కొత్త నేత పేరు ప్రతిపాదనను, పార్టీ మద్దతును ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కి ఆయన తెలియజేసే అవకాశాలు ఉన్నాయి.
ఢిల్లీ: ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నేడు (మంగళవారం) సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనాను ఇవాళ (మంగళవారం) సాయంత్రం 4.30 గంటలకు కలవనున్నారు. ఈ భేటీలో రాజీనామా లేఖను సమర్పించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. తన రాజీనామా నేపథ్యంలో.. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కొత్త సీఎం అభ్యర్థిని అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇవాళే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు కొత్త నేత పేరు ప్రతిపాదనను, పార్టీ మద్దతును ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కి ఆయన తెలియజేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త సీఎం అభ్యర్థి పేరుని ప్రకటించిన తర్వాత సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది.
మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ భేటీ కానున్నారు. సాయంత్రం 4.30కు లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఆయన కలవనున్నారు. కాగా సీఎం రేసులో మంత్రులు అతిషి, భరద్వాజ్, గోపాల్ రాయ్, గెహ్లాట్ ఉన్నారు. ప్రజా తీర్పు తర్వాతే తిరిగి సీఎం పదవిలో కూర్చుంటానని ఇప్పటికే కేజ్రీవాల్ ప్రకటించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఢిల్లీ ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు.
షెడ్యూలు ప్రకారం అయితే ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఢిల్లీ లిక్కర్ కేసులో దాదాపు 6 నెలలపాటు కేజ్రీవాల్ జైలులో గడిపారు. కోర్టు షరతులు విధించడంతో సీఎంగా విధుల నిర్వహణకు ఆయన దూరంగా ఉన్నారు. రెండు రోజుల క్రితం పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీలో తన రాజీనామా వ్యవహారాన్ని సీఎం ప్రస్తావించారు.
ఇవి కూడా చదవండి
రాహుల్‌గాంధీ నాలుక కోస్తే రూ.11 లక్షలు ఇస్తా