Asaduddin Owaisi house vandalised: పోలీస్ కమిషనర్‌కు సమన్లు జారీ చేసిన లోక్‌సభ స్పీకర్
ABN , Publish Date - Jun 28 , 2024 | 05:48 PM
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై దాడి కేసు ఘటనలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం న్యూఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు సమన్లు జారీ చేశారు. గత రాత్రి ఒవైసీ నివాసంపై ఆగంతకులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఒవైసీ వివరించారు.
న్యూఢిల్లీ, జూన్ 28: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై దాడి కేసు ఘటనలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం న్యూఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు సమన్లు జారీ చేశారు. గత రాత్రి ఒవైసీ నివాసంపై ఆగంతకులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఒవైసీ వివరించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన్ని ఈ సందర్బంగా ఒవైసీ కోరినట్లు సమాచారం. అదీకాక అత్యంత భద్రత జోన్‌గా పరిగణించే ఈ ప్రాంతంలో దాడి జరిగింది. దాంతో ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు స్పీకర్ నోటిసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ ఘటన జరిగిన వెంటనే.. ఫిర్యాదు రావడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ అతికించిన పోస్టర్లను తొలగించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు భారత్ మాతాకీ జై అనని వారు దేశంలో ఎలా ఉంటారు. దేశ ఐక్యతకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ నాయకులతో పోరాడేందుకు యువతంతా ఏకమవ్వాలంటూ యువకుడు మాట్లాడిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నిన్న రాత్రి ఒవైసీ నివాసంపై ఆగంతకులు దాడి చేశారు. దాంతో ఆ వెంటనే ఒవైసీ ఎక్స్ వేదికగా స్పందించారు. తన నివాసంపై దుండగులు దాడి చేసి నల్ల ఇంక్ చల్లారన్నారు. ఢిల్లీలోని తన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఎన్ని సార్లు దాడి జరిగిందో లెక్కలేదన్నారు. ఈ విషయంలో తామేమి చేయలేమని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారని స్పష్టం చేశారు. అయితే ఇది మీ పర్యవేక్షణలో జరుగుతుందని.. ఎంపీల భద్రతకు గ్యారంటీ ఉందా? లేదా? అంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పేర్లను తన ఎక్స్ ఖాతాకు ఒవైసీ ట్యాగ్ చేసి పోస్ట్ చశారు. అలాగే తన నివాసంపై దాడిని సావర్కర్ తరహా పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. ఇంక్ చల్లినా, రాళ్ల దాడి జరిగినా భయపడే ప్రసక్తే లేదని ఒవైసీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Political Tragedy: అయ్య బాబోయ్.. అచ్చుగుద్దినట్లుగా సేమ్ టు సేమ్..
ఇటీవల లోక్‌సభలో ఎంపీల ప్రమాణం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జై పాలస్తీనా అంటు తన ప్రమాణంలో పేర్కొన్నారు. దీనిపై బీజేపీ ఎంపీల నుంచే కాదు.. పలువురు కేంద్ర మంత్రుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. దాంతో ప్రొటెం స్పీకర్ స్థానంలో ఉన్న రాధా మోహన్ సింగ్.. ఈ పదాన్నిరికార్డుల నుంచి తొలగించాలా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. మరోవైపు ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు నవనీత్ కౌర్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఒవైసీ లోక్ సభ సభ్యత్వం రద్దు చేయాలని ఆ లేఖలో రాష్ట్రపతిని ఆమె కోరారు. ఈ తరహా డిమాండ్ పలు ప్రాంతాలను నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
For AP News and Telugu News