Doctor rape case: ఒంటరిగా ఉండొద్దంటూ మెడికల్ కాలేజీ అడ్వయిజరీ.. క్షణాల్లోనే యూటర్న్
ABN , Publish Date - Aug 14 , 2024 | 03:35 PM
గువాహటి: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైన నేపథ్యంలో అసోంలోని ఒక ఆసుపత్రి జారీ చేసిన అడ్వయిజరీ తీవ్ర విమర్శలకు గురైంది. దీంతో ఆ అడ్వయిజరీని యాజమాన్యం ఉపసంహరించుకుంది.
గువాహటి: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైన నేపథ్యంలో అసోంలోని ఒక ఆసుపత్రి జారీ చేసిన అడ్వయిజరీ తీవ్ర విమర్శలకు గురైంది. దీంతో ఆ అడ్వయిజరీని యాజమాన్యం ఉపసంహరించుకుంది.
CBI: కోల్‌కతా చేరుకున్న సీబీఐ.. వైద్యురాలిపై హత్యాచారం కేసులో దర్యాప్తు
అసోంలోని సిల్చార్ మెడికల్ కాలేజీ అండ్ హాస్టిటల్ బుధవారంనాడు మహిళా వైద్యులు, విద్యార్థినులు, హెల్త్‌కేర్ వర్కర్లకు అడ్వయిజరీ జారీ చేసింది. జనసంచారం లేని ప్రాంతాలు, వెలుతురు తక్కువగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ఒంటరిగా ఉండకుండా చూసుకోవాలని, అత్యవసరమైతే తప్ప రాత్రి సమయాల్లో వసతి గృహాలను విడిచి వెళ్లరాదని, అవసరమైతే అధికారులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని సూచించింది. అనుమానాస్పద వ్యక్తులతో జాగ్రత్తగా ఉండటం, విధుల్లో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం చేయాలని పేర్కొంది. కాగా, ఈ అడ్వయిజరీపై విద్యార్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. గదులకే పరిమితం కావాలని సూచించే బదులు భద్రతా ఏర్పాట్లు మెరుగుపరచాలని, క్యాంపస్‌లో లైటింగ్, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తక్షణం కాలేజీ యాజమాన్యం మెమోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఎస్ఎంసీహెచ్ ప్రిన్సిపాల్, చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ భాస్కర్ గుప్తా యూటర్న్ తీసుకుంటూ ఆ అడ్వయిజరీని ఉపసంహరించుకున్నారు. కొత్త అడ్వయిజరీని విడుదల చేస్తామని చెప్పారు.
Read More National News and Latest Telugu News