Himanta Biswa Sarma: 2041 నాటికి ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా...
ABN , Publish Date - Jul 19 , 2024 | 05:03 PM
అసోం జనాభాలో 40 శాతం మంది ముస్లింలు ఉన్నారని, 2041 నాటికి అసోంలో మెజారిటీ జనాభా ముస్లింలే కానున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ కుండబద్ధలు కొట్టారు. ఈ వాస్తవాన్ని ఎవరూ కాదనలేరని చెప్పారు.
గువాహటి: అసోం జనాభా (Assam populaion)లో 40 శాతం మంది ముస్లిం (Muslims)లు ఉన్నారని, 2041 నాటికి అసోంలో మెజారిటీ జనాభా ముస్లింలే కానున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ (Himanta Biswa Sarma) కుండబద్ధలు కొట్టారు. ఈ వాస్తవాన్ని ఎవరూ కాదనలేరని చెప్పారు. ప్రతి పదేళ్లకు ముస్లిం జనాభా 30 శాతం చొప్పున పెరుగుతోందని మంగళవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
రాహుల్ బ్రాండ్ అంబాసిడర్ అయితేనే...
ముస్లింల జనాభా పెరుగుదలలో కాంగ్రెస్ కీలక పాత్ర కీలకమని సీఎం శర్మ అన్నారు. జనాభా నియంత్రణకు రాహుల్ బ్రాండ్ అంబాసిడర్ అయితే ముస్లిం జనాభాను నియంత్రించవచ్చని అన్నారు. ముస్లిం కమ్యూనిటీ రాహుల్ మాటలు వింటుందని చెప్పారు.
UPSC Vs Puja Khedkar: ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్‌పై యూపీఎస్‌సీ కేసు, నోటీసులు
1935 చట్టం రద్దు చేస్తాం..
బాల్య వివాహాలను నిరోధించడం, వివాహాలు, విడాకుల రిజిస్ట్రేషన్ల విషయంలో సమానత్వం తీసుకువచ్చేందుకు పాతబడిన అసోం ముస్లిం మ్యారేజెస్ అండ్ డైవోర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్-1935ను రద్దు చేయాలని అసోం ప్రభుత్వం శుక్రవారంనాడు నిర్ణయించింది. దీనిపై సీఎం ఓ ట్వీట్ చేస్తూ, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అదనపు భద్రత కల్పించం ద్వారా మన ఆడపడుచులకు న్యాయం చేసేందుకు కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అసోం మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు అసోం ముస్లిం మ్యారేజెస్ అండ్ డైవోర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్-1935ను రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందుకోసం అసోం రిపీలింగ్ బిల్-2024ను వచ్చే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో తెస్తామని చెప్పారు. అసోంలో ముస్లిం వివాహాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన శాసనం చేసందుకు కూడా క్యాబినెట్ నిర్ణయించినట్టు తెలిపారు.