Home » Chief Minister
ఢిల్లీలోని ద్వారకా ప్రైవేటు స్కూలు యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఇటీవల ఫిర్యాదు చేశారు. ''లైబర్రీ అరెస్టు'' పేరుతో తమ పిల్లలను 25 రోజుల పాటు లైబ్రరీలోనే నిర్బంధించినట్టు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.
రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రాలు, కేంద్రం మధ్య సంబంధాలను మెరుగుపరచేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.
సీఎం ఈ విజ్ఞప్తి చేయడానికి కొద్ది రోజుల ముందే హైదర్‌పూర్ ఫ్లైఓవర్ వద్ద పశువుల మంద దూసుకురావడంతో సీఎం కాన్వాయ్ సుమారు 15 నిమిషాల పాటు నిలిచిపోయింది. రేఖాగుప్తా వెంటనే కారు దిగి ఆవులకు ఎలాంటి ప్రమాదం జరక్కుండా చూశారు.
రాణాను విజయవంతంగా ఇండియాకు తీసుకువచ్చి దేశ న్యాయవ్యవస్థ ముందు నిలబెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదిని ఫడ్నవిస్ ప్రశంసించారు. నవంబర్ 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడుల్లో తమ కుటుంబాలను కోల్పోయిన ముంబై ప్రజల తరఫున ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.
సుప్రీంకోర్టు నుంచి తమిళనాడు ప్రభుత్వానికి లభించిన ఊరటపై అసెంబ్లీలో స్టాలిన్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పుతో గవర్నర్ నిలిపి ఉంచిన బిల్లులన్నీ ఇప్పుడు ఆయన ఆమోదముద్ర పడి చట్టరూపం దాలుస్తాయని చెప్పారు.
త్రిభాషా విధానం, డీలిమిటేషన్ అంశాలపై తమిళనాడు ప్రభుత్వం, కేంద్రానికి మధ్య వివాదం నడుస్తున్న తరుణంలో ప్రధాని అధికారిక కార్యక్రమానికి సీఎం హాజరుకాకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.
నీట్‌పై రాష్ట్ర ప్రభుత్వం చిరకాలంగా సాగిస్తున్న పోరాటం కొనసాగుతుందని ఎంకే స్టాలిన్ చెప్పారు. తదుపరి కార్యాచరణపై సమగ్రంగా చర్చించేందుకు ఏప్రిల్ 9న అఖిలపక్ష సమావేశానికి ఆయన పిలుపునిచ్చారు.
ప్రస్తుతం ఉన్న వక్ఫ్ చట్టంలోని నిబంధనలు కాలపరీక్షకు నిలిచాయని, వక్ఫ్ ఆస్తులకు రక్షణ కల్పించాయని స్టాలిన్ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే వక్ఫ్ చట్టంలో కొత్తగా తీసుసువస్తున్న సవరణలు వక్ఫ్ నిర్వహణ, ఆస్తుల పరిరక్షణకు సంబంధించి బోర్డులకున్న అధికారాలు, బాధ్యతలను బలహీనపరచేలా ఉన్నాయన్నారు.
మోదీ సెప్టెంబర్‌లో రిటైర్మెంట్ కావాలనే ఆలోచనతో నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి మోహన్ భగవత్‌ను కలిసారని శివసేన (యూబీటీ)నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలను ఫడ్నవిస్ కొట్టివేశారు.
ఢిల్లీ-ఎన్సీఆర్లో రవాణా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,000 కోట్లు కేటాయించారు. సంక్షేమ పథకాల్లో భాగంగా అర్హత కలిగిన మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం అందించేందుకు రూ.5,100 కోట్లు కేటాయించారు.