Hajj Yatra: హజ్ యాత్రలో వడదెబ్బ మృతులు 98.. వెల్లడించిన ఎంఈఏ
ABN , Publish Date - Jun 21 , 2024 | 05:58 PM
సౌదీ అరేబియాలోని హజ్ యాత్రకు వెళ్లిన వారిలో 98 మంది భారతీయులు వడదెబ్బతో మృతి చెందినట్టు కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ శుక్రవారంనాడు తెలిపారు. ఇవన్నీ సహజ మరణాలేనని వెల్లడించారు.
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలోని హజ్ యాత్ర (Hajj Yatra)కు వెళ్లిన వారిలో 98 మంది భారతీయులు వడదెబ్బ (Heatstroke)తో మృతి చెందినట్టు విదేశాంగ శాఖ (MEA) ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ (Randhir Jaiswal) శుక్రవారంనాడు తెలిపారు. హోలీ పవిత్ర మాసంలో వంద మందికి పైగా మృతి చెందినట్టు కొన్ని పత్రికల్లో వార్తలు రావడంపై ఆయన వివరణస్తూ, సుమారు 98 మంది హజ్ యాత్రికులు సహజ కారణాలతో మృతి చెందినట్టు చెప్పారు.
Adhir Ranjan: లోక్‌సభ ఫలితాల పర్యవసానం.. అధీర్ రంజన్ రాజీనామా
''ఈ ఏడాది ఇప్పటివరకూ 1,75,000 భారతీయులు హజ్‌ను సందర్శించారు. 98 మంది పౌరులను మనం కోల్పోయాం. ఈ మరణాలన్నీ సహజ వ్యాధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, వయోభారంతో సంభవించినవే. పవిత్రమైన అరఫా రోజు ఆరుగురు, వివిధ ఘటనల్లో మరో నలుగురు మరణించారు. గత ఏడాది మృతుల సంఖ్య 187 వరకూ ఉంది'' అని జైశ్వాల్ తెలిపారు.
Read Latest National News and Telugu News