Share News

UPSE 2024: సివిల్స్ ఆశావాహుల్లో నిరాశ మిగిల్చిన ‘గూగుల్ మ్యాప్’

ABN , Publish Date - Jun 17 , 2024 | 08:19 PM

హైదరాబాదీలు.. ఇటీవల కేరళ పర్యటనకు కారులో వెళ్లారు. ఆ క్రమంలో వారు గూగుల్ మ్యాప్‌ను అనుసరించారు. దీంతో వారు కారు వాగులోకి దూసుకు వెళ్లింది. అయితే అదే సమయంలో స్థానికులు వారిని రక్షించారు. దీంతో వారు బతికిపోయారు.

UPSE 2024: సివిల్స్ ఆశావాహుల్లో నిరాశ మిగిల్చిన ‘గూగుల్ మ్యాప్’

హైదరాబాదీలు.. ఇటీవల కేరళ పర్యటనకు కారులో వెళ్లారు. ఆ క్రమంలో వారు గూగుల్ మ్యాప్‌ను అనుసరించారు. దీంతో వారి కారు వాగులోకి దూసుకు వెళ్లింది. అయితే అదే సమయంలో స్థానికులు వారిని రక్షించారు. దీంతో వారు బతికిపోయారు. అయితే అదే గూగుల్ మ్యాప్‌ను నమ్ముకున్న పలువురు సివిల్స్ ఆశావాహులకు తాజా సంఘటన నిరాశ మిగిల్చింది. జూన్ 16వ తేదీ దేశవ్యాప్తంగా యూపీఎస్‌సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. ఆ క్రమంలో మహారాష్ట్ర్ర సమర్థ్‌నగర్‌లోని స్వామి వివేకానంద కాలేజీ ఎగ్జామ్ సెంటర్‌ ఏర్పాటు చేసింది.


పలువురు సివిల్స్ ఆశావాహులు.. ఆ ఎగ్జామ్ సెంటర్‌ వెళ్లేందుకు గూగుల్ మ్యాప్‌ను అనుసరించారు. దీంతో సదరు కాలేజీ వడగావ్ కోహ్లటీలోని ఉన్నట్లు గూగుల్ మ్యాప్‌లో లోకేషన్ చూపించింది. ఈ మ్యాప్‌పై ఆధారపడిన దాదాపు 50 మంది విద్యార్థులు వడగావ్ కోహ్లటీకి చేరుకున్నారు. స్వామి వివేకానంద కాలేజీ గురించి స్థానికులను వారు వాకబ్ చేయగా.. ఆ పేరుతో అక్కడ కాలేజీ లేదని తెలిపారు. దీంతో స్వామి వివేకానంద కాలేజీ అడ్రస్ కనుక్కొని వారంతా.. సమర్థ్ నగర్ చేరుకునే సరికి సమయం మించిపోయింది. దీంతో వారిని పరీక్ష కేంద్రంలోకి కాలేజీ సిబ్బంది అనుమతించ లేదు. ఆ క్రమంలో వారంతా నిరాశతో వెను తిరిగారు.

Also Read: Read Latest National News and Telugu States News

Updated Date - Jun 17 , 2024 | 08:34 PM