Ayodhya: రామనామంతో మారుమోగుతోన్న అయోధ్య.. భక్తుల సౌకర్యం కోసం 100 ఎలక్ట్రిక్ బస్సులు
ABN , Publish Date - Jan 09 , 2024 | 11:03 AM
శ్రీరాముని నామంతో అయోధ్యపురి మారుమోగుతోంది. ఈ నెల 22వ తేదీన రామజన్మభూమిలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది. ఇప్పటికే అయోధ్య పురవీధుల్లో భక్త జన సంచారం పెరిగింది. అందుకు తగిన ఏర్పాట్లను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమైంది.
అయోధ్య: శ్రీరాముని నామంతో అయోధ్యపురి (Ayodhya) మారుమోగుతోంది. కలియుగ దైవం శ్రీరాముడిని భక్తులు స్మరిస్తున్నారు. ఈ నెల 22వ తేదీన రామజన్మభూమిలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది. ఇప్పటికే అయోధ్య (Ayodhya) పురవీధుల్లో భక్త జన సంచారం పెరిగింది. అందుకు తగిన ఏర్పాట్లను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (Uttar Pradesh Government) చేస్తోంది.
అయోధ్య లో (Ayodhya) రామజన్మభూమి, ఇతర ఆలయాలు సందర్శించే భక్తులు, పర్యాటకులకు మౌలిక వసతుల సదుపాయాల కల్పనపై యూపీ సర్కార్ దృష్టిసారించింది. ధర్మ పత్, రామ్ పత్ వద్ద ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉంటాయి. అయోధ్యలో (Ayodhya) 22వ తేదీన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తర్వాత నేపథ్యంలో సీతారాముల దర్శనం కోసం వచ్చే భక్తులతో రద్దీ నెలకొనే అవకాశం ఉంది. వాహనాల కోసం ప్రస్తుతం తాత్కాలిక పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 15వ తేదీన ధర్మ మార్గం, రామపత్‌లో 100 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయి. ఈ రిక్షాలు కూడా సమకూర్చారు. సాకేత్ పెట్రోల్ పంప్ నుంచి లతా మంగేష్కర్ చౌక్ వరకు తాత్కలిక పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. అక్కడే శాశ్వత పార్కింగ్ కూడా డెవలప్ చేస్తామని జిల్లా కలెక్టర్ నితీష్ కుమార్ (Nitish Kumar) ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయ చౌక్ వద్ద చౌదా కోసి, పంచకోసి మార్గాలలో పార్కింగ్ కోసం 70 ఎకరాల స్థలం సమకూర్చారు. అయోధ్యకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్నీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ నితీష్ వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.