Baby 81: రాకాసి సునామీకి 20 ఏళ్లు.. ఆనాటి లక్కీ బేబీ.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా..
ABN , Publish Date - Dec 26 , 2024 | 06:32 PM
Indian Ocean Tsunami: అది 2004 డిసెంబర్ 26. ఆ రోజు ప్రశాంతంగా నిద్రలేచిన ప్రపంచం.. రాత్రికి మాత్రం భయాందోళనల మధ్య జాగారం చేయాల్సిన పరిస్థితి. ఇండోనేషియాలోని (Indonesia) సుమత్రాలో 9.1 తీవ్రతతో సంభవించిన ఈ సునామీ (Tsunami) రాకాసి అలలు అనేక దేశాలను చుట్టుముట్టాయి. దీని కారణంగా డజనుకు పైగా దేశాల్లో..
Baby 81: వేల మందిని పొట్టనపెట్టుకున్న రాకాసి సునామీ వచ్చి సరిగ్గా 20 ఏళ్లు అవుతోంది. ఇండోనేషియాలో సంభవించిన ఈ సునామీ.. భారత్‌తో పాటూ అనేక దేశాల్లో బీభత్సం సృష్టించింది. అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యాల్లో ఒకటిగా నిలిచిన ఈ సునామీ నుంచి ఓ చిన్నారి అదృష్టవశాత్తు బయటపడ్డాడు. బేబీ-81గా ప్రపంచానికి పరిచయమైన ఈ బాలుడి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అది 2004 డిసెంబర్ 26. ఆ రోజు ప్రశాంతంగా నిద్రలేచిన ప్రపంచం.. రాత్రికి మాత్రం భయాందోళనల మధ్య జాగారం చేయాల్సిన పరిస్థితి. ఇండోనేషియాలోని (Indonesia) సుమత్రాలో 9.1 తీవ్రతతో సంభవించిన ఈ సునామీ (Tsunami) రాకాసి అలలు అనేక దేశాలను చుట్టుముట్టాయి. దీని కారణంగా డజనుకు పైగా దేశాల్లో 2,20,000 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండోనేషియాలోనే లక్ష 70 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. శ్రీలంకలో 35 వేల మంది చనిపోయారు.
అలాగే ఏపీలో 107 మంది, కేరళలో 177 మంది, తమిళనాడులో 8009 మంది మృత్యువాత పడ్డారు. ఇదిలావుండగా శ్రీలంక తీరంలో ఓ బాలుడు మాత్రం మృత్యుంజయుడిగా నిలిచాడు. రెండు నెలల వయసున్న జయరస అభిలాష్ అనే బాలుడు.. సునామీ అలలకు కొట్టుకుపోయాడు. తర్వాత పిల్లాడి కోసం కుటుం సభ్యులు ఎంత వెతికినా కనిపించలేదు. మట్టిలో కూరుకుపోయిన ఆ బాలుడు ఆశ్చర్యకంగా ప్రాణాలతో ఉండడాన్ని స్థానికులు కొందరు గమనించారు. వెంటనే బయటికి తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి సిబ్బంది ఆ బాలుడికి 81 నంబర్ కేటాయించడంతో అప్పట్లో బేబీ 81గా ప్రపంచానికి తెలిశాడు.
సునానీ బీభత్సంలో తప్పిపోయిన తన కుటుంబం కోసం అప్పట్లో ఈ బాలుడి తండ్రి మురుగుపిళ్లై జయరాసా ఎంతగానే వెతికాడు. ఈ క్రమంలో తన భార్యను కనుక్కున్నా.. చిన్నారిని మాత్రం పసిగట్టలేకపోయాడు. మొదట్లో ఈ బేబీని తీసుకున్న ఓ నర్సు.. ఆ తర్వాత ఆ బాలుడి కుటుంబం గురించి తెలుసుకుని తిరిగి ఇచ్చేసింది. ఆ తర్వాత ఈ చిన్నారి తల్లిదండ్రులు ఎవరనే విషయంపై కోర్టులో కూడా విచారణలు జరిగాయి.
ఎట్టకేలకు డీఎన్‌ఏ పరీక్షల ద్వారా చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. అప్పటికి ఆ లక్కీ బేబీకి కూడా ప్రస్తుతం 20 ఏళ్ల వచ్చాయి. హైస్కూల్ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన అభిలాష్.. ప్రస్తుతం పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. విశ్వవిద్యాలయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివాలని ఉందని అభిలాష్ చెబుతున్నాడు. సునామీ వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభిలాష్.. తన తండ్రితో కలిసి అప్పటి రోజులను తెలుసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.