Share News

Badlapur case: బద్లాపూర్ లైంగిక దాడి ఘటన నిందితుడు పోలీసు కాల్పుల్లో హతం

ABN , Publish Date - Sep 23 , 2024 | 09:02 PM

అక్షయ్ షిండే మాజీ భార్య తాజాగా ఇచ్చిన ఒక ఫిర్యాదుపై థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా నిందితుడిని తలోజా జైలు నుంచి సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో కస్టడీలోకి తీసుకుంది.

Badlapur case: బద్లాపూర్ లైంగిక దాడి ఘటన నిందితుడు పోలీసు కాల్పుల్లో హతం

థానే: మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్‌ (Badlapur)లోని ఓ పాఠశాలలో ఇటీవల ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన స్వీపర్ అక్షయ్ షిండే (Akshay Shinde) సోమవారంనాడు పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో మరణించాడు. ప్రాథమిక సమచారం ప్రకారం ఓ పోలీసు అధికారి నుంచి తుపాకీ లాక్కున్న షిండే తప్పించుకునే ప్రయత్నంలో వారిపై కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన షిండే ఆసుత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు.


అక్షయ్ షిండే మాజీ భార్య తాజాగా ఇచ్చిన ఒక ఫిర్యాదుపై థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా నిందితుడిని తలోజా జైలు నుంచి సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో కస్టడీలోకి తీసుకుంది. విచారణ కోసం థానే తీసుకువెళ్తుండగా ముంబ్రా బైపాస్ వద్దకు వాహనం చేరుకున్న సమయంలో ఒక పోలీసు అధికారి నుంచి రివాల్వర్ లాక్కున్న షిండే రెండు నుంచి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒక పోలీసు కూడా గాయపడ్డాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో షిండే తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని కల్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతిచెందాడు.

Uttarpradesh: 6 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం.. కోతుల రాకతో నిందితుడి పరార్!


బద్లాపూర్ హారర్..

బద్లాపూర్‌ టౌన్‌లోని ఓ పాఠశాలలో ఇద్దరు బాలికలపై స్వీపర్ లైంగిక దాడి ఘటన గత నెలలో సంచలనం సృష్టించింది. ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. కాంట్రాక్టు పద్ధతిలో 23 ఏళ్ల షిండేను ఆగస్టు 1న పాఠశాలలో నియమించారు. చేరిన పది రోజుల్లోనే ఇద్దరు బాలికలపై అతను లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆలస్యంగా కేసు నమోదు చేసిన సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, బద్లాపూర్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలంటూ పోలీస్ కమిషనర్‌ను ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదేశించారు. పాఠశాల ప్రిన్సిపాల్, క్లాస్ టీచర్, అటెండెంట్‌ను యాజమాన్యం సస్పెండ్ చేసింది.


Read More National News and Latest Telugu News

Also Read: Narendra Modi: యూఎస్‌లో మరో రెండు భారతీయ రాయబార కార్యాలయాలు ఏర్పాటు

Updated Date - Sep 23 , 2024 | 09:02 PM