Ballari: భయం.. భయం.. ఆందోళనలో గర్భిణులు
ABN , Publish Date - Dec 29 , 2024 | 01:36 PM
జిల్లాలో గర్భిణులకు కాన్పుల భయం వీడలేదు. నవమాసాలు మోసి ప్రసవానికి వచ్చిన తల్లులు మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. గత నెలలో బళ్లారి(Ballari)లో జరిగిన బాలింతల మరణాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే.
- ఆగని బాలింతల మరణాలు
- విజయనగర జిల్లాలో మరో ఇద్దరి మృతి
- హోటల్లో ఇడ్లీ తిన్నందుకే అంటున్న వైద్యులు
బళ్లారి(బెంగళూరు): జిల్లాలో గర్భిణులకు కాన్పుల భయం వీడలేదు. నవమాసాలు మోసి ప్రసవానికి వచ్చిన తల్లులు మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. గత నెలలో బళ్లారి(Ballari)లో జరిగిన బాలింతల మరణాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. దుర్ఘటన మరిచిపోక ముందే రెండ్రొజుల క్రితం విజయనగర (హొస్పేట్)లో ఇద్దరు బాలింతలు మృతి చెందారు.
ఈ వార్తను కూడా చదవండి: Secunderabad: ఒడిశా టు మహారాష్ట్రకు గంజాయి సరఫరా..
బళ్లారి జిల్లా సండూరు తాలూకా ఇంగల్లి గ్రామానికి చెందిన ఐశ్వర్య అనే గర్భిణీ విజయనగర(Vijayanagara) జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి డిసెంబరు 20న కాన్పు కోసం చేరింది. ఆమెకు ఈ నెల 24న సిజేరియన్ చేసి కాన్పు చేశారు. తరువాత ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళణకరం కావడంతో ఆమెను కొప్పళ జిల్లాకు వైద్యం కోసం తరిలించారు. చికిత్స పొందతూ ఆమె శుక్రవారం రాత్రి మరణం చెందారు. బాలింత మరణంతో బంధవులు, ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే జిల్లా వైద్యధికారి బాలింత మృతికి బయట హోటల్ నుంచి తెచ్చిన ఇడ్లీలే కారణమని ప్రకటించారు. కలుషితమైన ఆహారం తినిపించారని, అందుకే ఘటన జరిగిందని పేర్కొంటున్నారు. మరో బాలింత పూజ కూడా కాన్పు తరువాత మరణం చెందారు. ఈమెకు కాన్పు తేదీ కన్నా ముందే సిజేరియన్ చేయడం వల్ల మృతి చెందిందని వైద్యులు పేర్కొంటున్నారు. ఇద్దరు బాలింతల మృతితో మరోసారి జిల్లాలో ఆందోళన మొదలయ్యింది.
ఈవార్తను కూడా చదవండి: KTR: 7న విచారణకు రండి
ఈవార్తను కూడా చదవండి: Dharani: సంక్రాంతిలోపే భూ భారతి!
ఈవార్తను కూడా చదవండి: Nalgonda: ఫోన్ మాట్లాడుతూ విద్యుత్ తీగను తాకి..
ఈవార్తను కూడా చదవండి: భార్య, పిల్లలకు విషం ఇచ్చి.. ఉరేసుకున్న కానిస్టేబుల్
Read Latest Telangana News and National News