Bangalore: మహిళా మంత్రిపై సీటీ రవి అనుచిత వ్యాఖ్యలు..
ABN , Publish Date - Dec 20 , 2024 | 12:39 PM
అంబేడ్కర్‌కు అవమానం జరిగిందనే అంశంపై పరిషత్‌లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తలెత్తిన వాగ్వాదం తారస్థాయికి చేరి ఏకంగా బీజేపీ సీనియర్ సభ్యుడు సీటీ రవి(CT Ravi) అరెస్టుకు కారణమైంది.
- సభలో విరుచుకుపడ్డ కాంగ్రెస్
- దాడికి యత్నించిన మంత్రి అనుచరులు
- కారును అడ్డుకుని వీరంగం
- హెబ్బాళ్కర్ ఫిర్యాదుతో బీజేపీ నాయకుల అరెస్టు
బెంగళూరు: అంబేడ్కర్‌కు అవమానం జరిగిందనే అంశంపై పరిషత్‌లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తలెత్తిన వాగ్వాదం తారస్థాయికి చేరి ఏకంగా బీజేపీ సీనియర్ సభ్యుడు సీటీ రవి(CT Ravi) అరెస్టుకు కారణమైంది. అంబేడ్కర్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అవమానం చేశారని సమగ్ర చర్చకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యుడు బీకే హరిప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యులమధ్య వాగ్వాదానికి కారణమైంది.
ఈ వార్తను కూడా చదవండి: Bengaluru: కారు దూసుకెళ్ళి ఇద్దరి దుర్మరణం..
ఇదే సందర్భంలోనే సభాపతి బసవరాజ హొరట్టి జోక్యం చేసుకుని కలాపాలను సజావుగా జరిగేందుకు అవకాశం కల్పించాలని కోరినా ప్ర యోజనం లేకపోవడంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు. ఈ సందర్భంగా స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్(Minister Lakshmi Hebbalkar)ను ఉద్దేశించి సీటీ రవి అనుచితమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికార పార్టీ సభ్యులు సీటీ రవిపై విరుచుకుపడ్డారు. ఒకానొకదశలో ప్రతిపక్ష గ్యాలరీవైపు దూసుకొచ్చే ప్రయత్నం చేయగా మార్షల్స్ అడ్డుకున్నారు. లక్ష్మీ హెబ్బాళ్కర్ సోదరుడు, ఎమ్మెల్సీ చన్నరాజ్ హట్టిహొళి తీవ్రస్థాయిలో దూషించారు.
ఒకానొక దశలో సీటీ రవిపై దూసుకొచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించారు. వీరిని కట్టడి చేయడం మార్షల్స్‌కు సవాల్‌గా మారింది. మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ కూడా తీవ్రంగా మండిపడ్డారు. మీకు తల్లీభార్య కూతుళ్లు లేరా... ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా... అంటూ విరుచుకుపడ్డారు. డీసీఎం డీకే శివకుమార్ సహా మంత్రులు, కాంగ్రెస్ సభ్యులు సీటీ రవిని ఉద్దేశించి దూషించారు. అక్కడనుంచి సీటీ రవి సభనుంచి బయటకు రాగా మంత్రి అనుచరులు విరుచుకుపడి దాడికి ప్రయత్నించారు. మార్షల్స్ అడ్డుకుని గేట్‌లకు తాళాలు వేశారు. గేట్‌లను తన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా మంత్రి పట్ల తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అయినా సువర్ణసౌధలోనే దాడికి ప్రయత్నించారంటూ సీటీ రవి అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు. గేట్ వద్ద ఆయన కారును అడ్డుకునే ప్రయత్నం జరిగింది. ఈలోగా డీసీఎం డీకే శివకుమార్ సహా కీలక నేతలు మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌తో పాటు పరిషత్ సభాపతి బసవరాజ హొరట్టి చాంబర్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సభాపతి స్పందించి ఆడియో, వీడియోలను పరిశీలించాలని కార్యదర్శిని ఆదేశించారు. ఇలా సాగుతుండగానే మంత్రి బెళగావిలోని హిరేబాగేవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాత్రి 7 గంటలకు సీటీ రవిని అరెస్టు చేశారు. బీజేపీ సభ్యులను ప్రత్యేక వాహనాలలో సువర్ణసౌధ నుంచి తరలించారు.
ఈవార్తను కూడా చదవండి: ACB Case: కేటీఆర్ ఏ1
ఈవార్తను కూడా చదవండి: HYDRA: మణికొండలో హైడ్రా కూల్చివేతలు!
ఈవార్తను కూడా చదవండి: Jagityala: చిన్నారుల ప్రాణాలకు ‘పెద్ద’ ముప్పు!
ఈవార్తను కూడా చదవండి: కాళేశ్వరంపై విచారణ.. హాజరైన స్మితా సబర్వాల్, సోమేష్‌కుమార్..
Read Latest Telangana News and National News