Share News

Bangalore: త్వరలోనే మంత్రివర్గ విస్తరణ.. ఐదుగురికి ఉద్వాసన..?

ABN , Publish Date - Aug 13 , 2024 | 01:27 PM

రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేయాలని అధిష్టానం సూచించినట్టు తెలుస్తోంది. ఐదుగురిని కేబినెట్‌ నుంచి తొలగించి ఆరుగురి ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్నారు.

Bangalore: త్వరలోనే మంత్రివర్గ విస్తరణ.. ఐదుగురికి ఉద్వాసన..?

బెంగళూరు: రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేయాలని అధిష్టానం సూచించినట్టు తెలుస్తోంది. ఐదుగురిని కేబినెట్‌ నుంచి తొలగించి ఆరుగురి ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah)కు ఆప్తుడిగా ముద్ర పడిన నగరాభివృద్ధిశాఖ మంత్రి బైరతి సురేశ్‌, ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఎంసీ సుధాకర్‌, అబ్కారి మంత్రి ఆర్‌బీ తిమ్మాపుర, సహకారశాఖ మంత్రి రాజణ్ణ, ప్రజా పాలన, హజ్‌శాఖ మంత్రి రహీంఖాన్‌ను తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదికూడా చదవండి: పురావస్తు పరిశోధనలో బయల్పడిన రాతియుగం నాటి పనిముట్లు


ఇప్పటికే నాగేంద్ర రాజీనామాతో ఒక స్థానం ఖాళీగా ఉంది. వీటితో కలిపి ఆరు స్థానాలు భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే భద్రావతి ఎమ్మెల్యే సంగమేశ్‌కు కేబినెట్‌లో చోటు ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా భద్రావతిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ జరిగితే సంగమేశ్‌ మంత్రి అవుతారన్నారు.


......................................................................

ఈ వార్తను చదవండి:

...........................................................................

Bangalore: యడియూరప్ప పోక్సో కేసులో ట్విస్ట్‌..?

- హైకోర్టు ఆదేశాల రద్దుకు సర్కార్‌ కసరత్తు

బెంగళూరు: మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) అవినీతి కేసులో ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) రాజీనామా కోరుతూ బీజేపీ-జేడీఎస్‌ పాదయాత్రతోపాటు నిరంతరంగా పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ సీనియర్‌ నేత యడియూరప్ప(Senior BJP leader Yeddyurappa)పై దాఖలైన పోక్సో కేసులో ట్విస్ట్‌ ఇవ్వనున్నట్లు సమాచారం.


pandu1.2.jpg

యడియూరప్ప అరెస్టుకు హైకోర్టు స్టే విధించింది. సదరు స్టేను రద్దు చేయించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆ దిశగా న్యాయనిపుణులకు సూచనలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త టీజే అబ్రహాంపై పెండింగ్‌ కేసులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. తాజాగా యడియూరప్పపైనా పోక్సో కేసును తిరగతోడేందుకు సిద్ధమయ్యారు. రెండు రోజుల కిందట సీఎం సిద్దరామయ్య బీజేపీ నాయకుల పట్ల కనికరం చూపేది లేదని ప్రకటించిన వెంటనే ఈ అంశాలు తెరపైకి రావడం కీలకమైంది.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 13 , 2024 | 01:32 PM