Bangalore: సీఎం కావాలంటే ఎమ్మెల్యేల మద్దతు ఉండాలిగా..
ABN , Publish Date - Jun 15 , 2024 | 01:26 PM
ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యేల మద్దతు ఉండాలని, 60 మంది ఎమ్మెల్యేల రాజీనామా అంటే పిల్ల చేష్టలా..? అని భారీ పరిశ్రమలశాఖ మంత్రి ఎంబీ పాటిల్(Minister MB Patil) పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. ప్రస్తుతానికి సీఎం స్థానంలో సిద్దరామయ్య ఉన్నారని, ఆ కుర్చీ ఖాళీగా లేదని, ఆ ప్రశ్నే రాదన్నారు.
- 60 మంది రాజీనామా అంటే పిల్ల చేష్టలా..?
- భారీ పరిశ్రమలశాఖ మంత్రి ఎంబీ పాటిల్
బెంగళూరు: ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యేల మద్దతు ఉండాలని, 60 మంది ఎమ్మెల్యేల రాజీనామా అంటే పిల్ల చేష్టలా..? అని భారీ పరిశ్రమలశాఖ మంత్రి ఎంబీ పాటిల్(Minister MB Patil) పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. ప్రస్తుతానికి సీఎం స్థానంలో సిద్దరామయ్య ఉన్నారని, ఆ కుర్చీ ఖాళీగా లేదని, ఆ ప్రశ్నే రాదన్నారు. శనివారం హుబ్బళ్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముగ్గురు డీసీఎంలు కావాలనే అంశం పార్టీ అంతర్గత విషయమని, బహిరంగంగా చర్చించలేమని పేర్కొన్నారు. ఇప్పటికే పార్టీలో తమ అభిప్రాయాలు తెలిపామన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పతనమవుతుందనే బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తొలుత మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడుకుంటే బాగుంటుందన్నారు. ఆ తర్వాత తమ ప్రభుత్వం గురించి మాట్లాడవచ్చు అన్నారు. తమ ప్రభుత్వం పతనం కావాలంటే 60 మంది రాజీనామా చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి: IAS officers: 13 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ..
బీజేపీ(BJP)కి చెందినవారే తమతో ఉన్నారని, ఇక జేడీఎస్ నుంచి కొందరు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 60మంది రాజీనామా చేస్తే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందని, ఇదంతా పిల్లచేష్టలు కాదని అన్నారు. ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీవైపు వెళ్లే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. గ్యారెంటీలు రద్దు చేయాలనే ఆలోచన తమ వద్ద ప్రస్తుతానికి లేదన్నారు. కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రిగా కుమారస్వామితో పాటు పలు కీలకశాఖలు రాష్ట్రానికి దక్కడం సంతోషకరమన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షలు జరుగుతాయన్నారు. మంత్రులను తొలగిస్తారనేది మీడియా కథనాలు మాత్రమే అన్నారు. యడియూరప్పపై రాజకీయ ద్వేషం లేదని, పోక్సో కేసు విచారణ జరుపుతున్న పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. నటుడు దర్శన్‌కు రాచమర్యాదల ప్రశ్నే లేదని, కేసులు రుజువైతే శిక్ష ఎదుర్కోవాల్సిందే అన్నారు. వ్యవసాయశాఖ రాయబారిగా నటుడు దర్శన్‌ను కొనసాగించే ప్రసక్తే లేదన్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News