Bangalore: కొవిడ్ అక్రమాలపై విచారణ..
ABN , Publish Date - Oct 11 , 2024 | 12:17 PM
బీజేపీ పాలనలో కొవిడ్ అక్రమాలపై సిట్ తోపాటు మంత్రివర్గ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలన కేబినెట్‌లో ఏకగ్రీవంగా తీర్మానించారు. సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) అధ్యక్షతన గురువారం మంత్రివర్గ భేటీ జరిగింది. కేబినెట్‌లో తీర్మానాలను రాష్ట్ర శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ మీడియాకు వెల్లడించారు.
- కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
- సిట్‌తో పూర్తి దర్యాప్తు
- మంత్రివర్గ తీర్మానం
బెంగళూరు: బీజేపీ పాలనలో కొవిడ్ అక్రమాలపై సిట్ తోపాటు మంత్రివర్గ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలన కేబినెట్‌లో ఏకగ్రీవంగా తీర్మానించారు. సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) అధ్యక్షతన గురువారం మంత్రివర్గ భేటీ జరిగింది. కేబినెట్‌లో తీర్మానాలను రాష్ట్ర శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ మీడియాకు వెల్లడించారు. 16 అంశాలపై కేబినెట్‌లో చర్చించినట్లు ఆయన తెలిపారు. కొవిడ్ పరిధిలో అవినీతికి సంబంధించి దర్యాప్తునకు కేబినెట్ సబ్‌కమిటీతోపాటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ వార్తను కూడా చదవండి: Rains: ఆరు రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశం..
కొవిడ్‌వేళ వస్తువుల కొనుగోళ్లకు సంబంధించి నియమించబడిన న్యాయమూర్తి మైఖేల్ డి కున్హా కమిషన్ 2024 ఆగస్టు 31న సమర్పించిన నివేదికపై కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించామన్నారు. కమిషన్ 11 సంపుటలతో నివేదిక ఇచ్చిందన్నారు. 7,223.64 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తేల్చిందన్నారు. 500 కోట్ల రూపాయలు వసూలు చేయాలని కమిషన్ సిఫారసు చేసిందన్నారు. బీబీఎంపీ 4 డివిజన్‌లతోపాటు 31 జిల్లాల నివేదిక ఇంకా పెండింగ్‌లో ఉందన్నారు. 55వేల ఫైళ్లకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ అనుమతులను పరిశీలించి నివేదిక ఇచ్చారన్నారు. ఇందులో క్రిమినల్ అంశాలు ఉన్నందున సిట్ ఏర్పాటు చేయాలని తీర్మానించామన్నారు. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ధారించామన్నారు. 500 కోట్ల రూపాయల వసూళ్లకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు.
కొవిడ్ అక్రమాల్లో భాగస్వామ్యులైన కంపెనీలు, సంస్థలను బ్లాక్‌లి్‌స్టలోకి చేర్చాలని తీర్మానించామన్నారు. ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో వాటికి సిట్ తనిఖీలు దృష్టి సారించి దర్యాప్తు చేస్తుందన్నారు. ఎవరి భాగస్వామ్యం ఏమిటనేది సిట్ దర్యాప్తులో బహిర్గతం కానుందన్నారు. సమగ్ర నివేదిక వచ్చాక ఎంతమేర అవినీతి జరిగింది, భాగస్వామ్యులు ఎవరనేది తేలుతుందన్నారు. ఎవరు తప్పు చేసినా చర్యలు ఉంటాయన్నారు. కొవిడ్ అక్రమాల్లో ఎవరు ఉన్నారని చెప్పలేమన్నారు. దర్యాప్తు చేసిన కున్హా కమిషన్ వెల్లడించాలన్నారు. సమగ్ర నివేదిక వచ్చాక నిజాలు తేలుతా యన్నారు. కున్హా కమిషన్ వేగవంతంగా పనిచేస్తోందని, న్యాయం లభిస్తుందనే విశ్వాసం ఉందన్నారు. కేబినెట్‌లో సీఎం సిద్దరామయ్యకు సంపూర్ణమైన మద్దతు లభించిందని, మంత్రులందరూ పాల్గొన్నారన్నారు. కొందరు మంత్రుల ప్రత్యేక భేటీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడాన్ని ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
సబ్ కమిటీ సభ్యులు వీరే..
కొవిడ్ అక్రమాలపై దర్యాప్తుకోసం రిటైర్డు న్యాయమూర్తి జాన్ మైఖేల్ డి కున్హా నేతృత్వంలోని కమిటీ తన తొలి నివేదికను సమర్పించింది. సదరు నివేదికలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రస్తావించారు. నివేదికను పరిశీలించేందుకు డీసీఎం అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. సబ్ కమిటీలో అధ్యక్షుడిగా డీసీఎం డీకే శివకుమార్, సభ్యులుగా మంత్రులు పరమేశ్వర్, హెచ్‌కే పాటిల్, దినేశ్ గుండూరావు, ప్రియాంక ఖర్గే, సంతోష్‌లాడ్, శరణ ప్రకాశ్ పాటిల్ ఉన్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు చెరువులు బాగుపడిందెలా?
ఇదికూడా చదవండి: Yadagirigutta: దసరా నుంచి స్వర్ణతాపడం పనులు
ఇదికూడా చదవండి: Hyderabad: అది పరిహారం కాదు.. పరిహాసం: కేటీఆర్
ఇదికూడా చదవండి: Manda krishna: వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్లు ఇవ్వాలి
Read Latest Telangana News and National News