Bangalore: బెంగళూరు సహా 5 రైల్వే స్టేషన్లలో రూ.20కే జనతా భోజనం
ABN , Publish Date - Apr 25 , 2024 | 01:04 PM
రైల్వే ప్రయాణీకులకు జనతా రూ.20కే భోజనం అందించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇండియన్ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ), రైల్వేశాఖ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం 20 రూపాయలకే భోజనాన్ని అందజేయనున్నారు.
- ఐఆర్సీటీసీతో రైల్వే శాఖ ఒప్పందం
బెంగళూరు: రైల్వే ప్రయాణీకులకు జనతా రూ.20కే భోజనం అందించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇండియన్ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ), రైల్వేశాఖ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం 20 రూపాయలకే భోజనాన్ని అందజేయనున్నారు. నైరుతి రైల్వే పరిధిలో బెంగళూరు కేఎస్ఆర్, యశ్వంతపుర, విజయపుర, మైసూరు, బళ్ళారి(Yeswantapura, Vijayapura, Mysore, Bellary) రైల్వే స్టేషన్లలో సౌలభ్యం అందుబాటులోకి రానుంది.
ఇదికూడా చదవండి: రూ. 25 వేల కోట్ల స్కాంలో సునేత్రకు క్లీన్చిట్
జనరల్ బోగీలలో ప్రయాణించేవారికి ఆరోగ్యకరమైన భోజనం, టిఫిన్లు సమకూర్చే కొత్త విధానమిది. దేశవ్యాప్తంగా 100 రైల్వే స్టేషన్లలో 150 కౌంటర్ల ద్వారా వేసవిలో ఈసౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. జనరల్ బోగీలలో ప్రయాణించేవారికి నాణ్యమైన ఆహారం అందించనున్నారు. సెకండ్‌క్లాస్ బోగీలు నిలిచే ప్లాట్‌ఫాం వద్దనే ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. 200 గ్రాముల చిత్రాన్నం, పులిహోర లేదా పెరుగన్నం రూ.20కే అందించనున్నారు. ఇక 350గ్రాములతో దక్షిణాది శైలి భోజనాన్ని రూ.50కే సమకూర్చనున్నట్లు రైల్వే అధికారి ఒకరు
ఇదికూడా చదవండి: Tamilisai: మైనార్టీలకు మోదీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు..
Read Latest National News and Telugu News