Bangalore: కేఆర్‌ఎస్ బ్యాక్‌వాటర్‌లో ‘సీ ప్లేన్’ సంచారం
ABN , Publish Date - Nov 05 , 2024 | 02:49 PM
రాష్ట్రంలో తొలిసారి నీటిపై విమానం ప్రయోగాత్మకంగా సంచరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సాధారణంగా విమానం ఆకాశంలో విహరించడం తెలిసిందే. పలు దేశాలలో నీటిపైనుంచే విమానం ముందుకు కదిలేలాంటి ప్రయోగాలు చేశారు.
- ఈనెల 10న ప్రయోగాత్మకంగా ఏర్పాట్లు
బెంగళూరు: రాష్ట్రంలో తొలిసారి నీటిపై విమానం ప్రయోగాత్మకంగా సంచరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సాధారణంగా విమానం ఆకాశంలో విహరించడం తెలిసిందే. పలు దేశాలలో నీటిపైనుంచే విమానం ముందుకు కదిలేలాంటి ప్రయోగాలు చేశారు. అటువంటిదే మండ్య(Mandya) జిల్లా కేఆర్‌ఎస్ ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్ వేణుగోపాలస్వామి దేవస్థానం వద్ద ప్రయో గాత్మకంగా సంచరించేందుకు నిర్ణయించారు. కేంద్రప్రభుత్వ విమానయాన సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి మండలితోపాటు వివిధశాఖల సంయుక్త సహకారంతో ఈనెల 10న ప్రయోగాత్మకంగా అమలు చేయదలిచారు.
ఈ వార్తను కూడా చదవండి: Bangalore: బాగేపల్లిలో ట్యాటూ స్వామి ప్రత్యక్షం
పర్యాటక అభివృద్ధిలో భాగంగా జల విమానం సంచారాన్ని ఆరంభించనున్నారు. 12మంది పర్యాటకులతో తొలిసారి ‘సీ ప్లేన్’ కేఆర్‌ఎస్ బ్యాక్‌వాటర్‌లో నాలుగుసార్లు సంచరించనుంది. నీటిపైనే సంచ రించడం, అక్కడే ల్యాండ్ కావడం ఈ విమానం ప్రత్యేకం. మైసూరులోని మండకళ్ళి విమానాశ్రయాన్ని కేంద్రంగా ఉపయోగించుకోదలిచారు. 2020లో గుజరాత్‌లోని నర్మదా జిల్లా సబర్మతి నదిలో తొలిసారి జల విమాన సేవలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరంభించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, కేరళలోనూ విజయవంతంగా పరిచయం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అవకాశం కల్పిస్తున్నారు. ఉడాన్ పథకంలో భాగంగా సేవలను కొనసాగించే ఆలోచనలో ఉన్నారు. ప్రయాణీకులు విమానంలో ప్రవేశించేందుకు, దిగేందుకు కేఆర్‌ఎస్ జలాశయంలో తేలుతున్న బ్రిడ్జ్‌ను కర్ణాటక జలరవాణా మండలి ఏర్పాటు చేయనుంది. పార్కింగ్, సురక్షిత బాధ్యతలను, లింక్ రోడ్డును ప్రజాపనులశాఖ కల్పించనుంది. విమానం ల్యాండింగ్, ఇతర లాజిస్టిక్స్ బాధ్యతలను మైసూరు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ పర్యవేక్షించనున్నట్టు కర్ణాటక స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
సీ ప్లేన్ నిపుణుల బృందం ఇప్పటికే వేణుగోపాలస్వామి ఆనందూరు వద్ద పరిశీలన జరిపారు. పది అడుగుల లోతు, 1.5 కిలోమీటర్ల వెడల్పుతో నీటి పరిస్థితిని అంచనా వేసుకుని సాంకేతిక అంశాలపైనా కావేరి బోర్డు ఇంజనీర్లతో సమాచారం సేకరిం చారు. ప్రయోగాత్మకం విజయవంతమైతే జల విమానసేవలు స్థానిక పర్యాటకులకు ఆకర్షణ కానున్నాయి. కేఆర్‌ఎస్ ప్రాజెక్ట్, బృందావన్ గార్డెన్స్‌లను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించనుంది.
ఈవార్తను కూడా చదవండి: మినరల్ కాదు.. జనరల్ వాటరే
ఈవార్తను కూడా చదవండి: 24 గంటల విద్యుత్ అంటూ మోసం: హరీశ్‌రావు
ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్, హరీశ్ ఇళ్ల ముందు ధర్నా చేయండి
ఈవార్తను కూడా చదవండి: అసంక్రమిత వ్యాధులకు ప్రత్యేక క్లినిక్‌లు
Read Latest Telangana News and National News