Bangalore: ఎమ్మెల్యేపై దాడితో.. ఎమ్మెల్సీ సీటీ రవికి భద్రత పెంపు
ABN , Publish Date - Dec 27 , 2024 | 01:00 PM
బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడిగుడ్లతో దాడి చేసిన సంఘటన నేపథ్యంలో ఎమ్మెల్సీ సీటీ ర(MLC CT Ravi)వికి భద్రత పెంచారు. వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలు ప్రభుత్వానికి చెడ్డపేరుగా మారుతున్నాయి.
- కాంగ్రెస్ గూండాయిజంకు రుజువు
- ప్రతిపక్షనేత అశోక్
బెంగళూరు: బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడిగుడ్లతో దాడి చేసిన సంఘటన నేపథ్యంలో ఎమ్మెల్సీ సీటీ ర(MLC CT Ravi)వికి భద్రత పెంచారు. వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలు ప్రభుత్వానికి చెడ్డపేరుగా మారుతున్నాయి. దీంతో పోలీసుశాఖ అప్రమత్తమైంది. విధానపరిషత్‌లోనే ఎమ్మెల్సీ సీటీ రవిపై దాడి సంఘటన మరువకముందే ఎమ్మెల్యే మునిరత్న(MLA Muniratna)పై దాడి సంఘటనతో పోలీసుశాఖ అప్రమత్తమైంది.
ఈ వార్తను కూడా చదవండి: Bangalore: రాజీనామా చేస్తే ప్రాణాలతో ఉంటావ్..
సీటీ రవి(MLC Ravi)కి భద్రత పెంచారు. ఆయన వెంట ఒక ఎస్కార్ట్ వాహనం సమకూర్చారు. కాగా బీజేపీ ప్రజాప్రతినిధులు సీటీ రవి, మునిరత్నలపై దాడికి రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) గూండాయిజంకు నిదర్శనమని ప్రతిపక్షనేత అశోక్ మండిపడ్డారు. బెంగళూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గూండా పాలన సాగుతోందన్నారు. దాడులను తాము తీవ్రంగా పరిగణిస్తామన్నారు.
ఈవార్తను కూడా చదవండి: ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం
ఈవార్తను కూడా చదవండి: SBI: ఎస్‌బీఐలో 600పీవో పోస్టులకు నోటిఫికేషన్
ఈవార్తను కూడా చదవండి: ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్.. మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు..
ఈవార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..
Read Latest Telangana News and National News