Barber: కస్టమర్‌కు ఎలా మసాజ్ చేశాడో తెలుసా..?
ABN , Publish Date - Jun 16 , 2024 | 10:46 AM
సెలూన్‌లో కటింగ్, షేవింగ్ చేసుకున్న తర్వాత తలకు ఆయిల్ రాయించుకోవడం, మొహనికి మసాజ్ చేయించుకోవడం కామన్. సెలూన్ నిర్వాహకులు రకరకాల క్రీమ్స్ రాసి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. లక్నోలో ఓ బార్బర్ తీరు విమర్శలకు దారితీసింది.
లక్నో: సెలూన్‌లో కటింగ్, షేవింగ్ చేసుకున్న తర్వాత తలకు ఆయిల్ రాయించుకోవడం, మొహనికి మసాజ్ చేయించుకోవడం కామన్. సెలూన్ నిర్వాహకులు రకరకాల క్రీమ్స్ రాసి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. లక్నోలో ఓ బార్బర్ తీరు విమర్శలకు దారితీసింది. కస్టమర్‌కు క్లీన్‌గా షేవింగ్ చేసి.. ఆ తర్వాత చేసిన మసాజ్ ఇందుకు కారణమైంది.
ఏం జరిగిందంటే..?
లక్నోలో ఓ సెలూన్‌కు కస్టమర్ వచ్చాడు. అతనికి జైద్ షేవింగ్ చేశాడు. గడ్డం తీసిన తర్వాత ఫేస్‌కు మసాజ్ చేయడం ప్రారంభించాడు. ఆ క్రమంలో తన చేతి మీద ఉమ్మాడు. దాంతో మసాజ్ చేశాడు. ఆ సమయంలో కస్టమర్ దానిని గమనించలేక పోయారు. తర్వాత అనుమానం వచ్చి షాపులో గల సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. ఉమ్మి వేసి మసాజ్ చేశాడని తెలిసి ఆందోళన చెందాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అడిగే చేస్తారు.. కానీ..!!
వాస్తవానికి కస్టమర్‌కు షేవింగ్ చేసిన తర్వాత మసాజ్ చేయాలా..? క్రీమ్ రాయాలా..? అని అడుగుతుంటారు. వారు ఓకే అంటేనే చేస్తుంటారు. ఈ కస్టమర్ విషయంలో అలానే జరిగి ఉంటుంది. అతను పరిశుభ్రతను పాటించలేదు. దీని వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కస్టమర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు జైద్‌ను అరెస్ట్ చేశారు.