Share News

Bengaluru: బైక్స్, కార్లను ఢీ కొన్న బస్సు

ABN , Publish Date - Aug 13 , 2024 | 02:56 PM

ఐటీ హబ్ బెంగళూర్‌ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. వీక్ డేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీకెండ్స్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. బెంగళూర్ రద్దీ రోడ్డులో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. బైక్స్, కార్లను ఢీ కొట్టి భయాందోళన కలిగించింది. ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు. ఒకతను చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాడు. బైక్స్, కార్లు మాత్రం డ్యామేజ్ అయ్యాయి. బస్సు అద్దం కూడా ధ్వంసమైంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ ట్రోల్ అవుతోంది. బస్సు డ్రైవర్ తీరును నెటిజన్లు ఏకీపారేస్తున్నారు.

Bengaluru: బైక్స్, కార్లను ఢీ కొన్న బస్సు
Bengaluru Bus Rams Bikers Cars

బెంగళూర్: ఐటీ హబ్ బెంగళూర్‌ (Bengaluru) ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. వీక్ డేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీకెండ్స్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. బెంగళూర్ రద్దీ రోడ్డులో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. బైక్స్, కార్లను ఢీ కొట్టి భయాందోళన కలిగించింది. ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు. ఒకతను చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాడు. బైక్స్, కార్లు మాత్రం డ్యామేజ్ అయ్యాయి. బస్సు అద్దం కూడా ధ్వంసమైంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ ట్రోల్ అవుతోంది. బస్సు డ్రైవర్ తీరును నెటిజన్లు ఏకీపారేస్తున్నారు.


blr-4.jpg


బైక్స్, కార్లను ఢీ కొంటూ

రద్దీగా ఉండే బెంగళూరులో వొల్వొ బస్సు మెల్లిగా వెళుతుంది. బస్సు ముందు కార్లు, బైక్స్ ఉన్నాయి. ఫస్ట్ వీడియో చూస్తే బస్సు డ్రైవర్ కంట్రోల్‌ ఉన్నాడని అనిపిస్తోంది. వీడియో 33 సెకన్లు దాటిన తర్వాత డ్రైవర్ బీభత్సం కనిపిస్తోంది. డ్రైవర్ బ్రేక్ వేయాల్సింది పోయి.. ఎక్స్ లెటర్ నొక్కి ఉంటాడు. ముందు బైక్‌ను ఢీ కొనడంతో అతను పడిపోతాడు. తర్వాత మరో బైక్, కారును ఢీ కొంటాడు. అప్పటికీ బస్సు కంట్రోల్‌లోకి రాదు.


blr--bus-1.jpg


టర్న్ తీసుకున్న కారు

ఓ కారును ఢీ కొంటూ ముందుకు తీసుకెళతాడు. ఆ కారు యూ టర్న్ తిరుగుతుంది. డ్రైవర్ వద్దకు కండక్టర్ వస్తాడు. ఏం జరిగింది.. బ్రేక్ వెయ్యు అని అడుగుతాడు. ముందు కారు యూ టర్న్ తిరిగి ఉండగా, బస్సును ఎలాగోలా ఆపుతాడు. బస్సు నుంచి డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులు దిగుతారు. తర్వాత బస్సు లోపలికి డ్రైవర్ వచ్చి, ఫోన్ తీసుకునే విజువల్ స్పష్టంగా కనిపిస్తోంది. అతని వద్దకు బైకర్లు, కారు ఓనర్లు వస్తారు. ఏం డ్రైవింగ్ చేస్తున్నావని నిలదీస్తారు. బస్సు డ్రైవర్ కాస్త సృహతో వ్యవహరిస్తే ప్రమాదం జరిగేది కాదు. డ్రైవర్ తీరును నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు.


blr-5.jpg

Updated Date - Aug 13 , 2024 | 02:56 PM