Share News

Bengaluru: గులాబ్‌జామ్‌.. రసగుల్లా.. ఆమె ఫోన్‌లో మాజీ మంత్రి, బీజేపీ నాయకుడి పేర్లు ఇవి..

ABN , Publish Date - Dec 25 , 2024 | 01:27 PM

మాజీ మంత్రి వర్తూరు ప్రకాశ్‌(Former Minister Varthur Prakash) పేరుతో బంగారు ఆభరణాలు తీసుకుని నగదు చెల్లించకుండా మోసం చేసిన శ్వేతాగౌడ(Shweta Gowda) కేసు విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

Bengaluru: గులాబ్‌జామ్‌.. రసగుల్లా.. ఆమె ఫోన్‌లో మాజీ మంత్రి, బీజేపీ నాయకుడి పేర్లు ఇవి..

- శ్వేతాగౌడ చీటింగ్‌ కేసులో ఆసక్తికర అంశాలు

బెంగళూరు: మాజీ మంత్రి వర్తూరు ప్రకాశ్‌(Former Minister Varthur Prakash) పేరుతో బంగారు ఆభరణాలు తీసుకుని నగదు చెల్లించకుండా మోసం చేసిన శ్వేతాగౌడ(Shweta Gowda) కేసు విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. కమర్షియల్‌ స్ట్రీట్‌ పోలీసుల నోటీసులకు అనుగుణంగా మాజీ మంత్రి వర్తూరు ప్రకాశ్‌ మంగళవారం విచారణకు హాజరయ్యారు. ఇదే సందర్భంలోనే సుదీర్ఘంగా పోలీసులు విచారణ సాగించారు.

ఈ వార్తను కూడా చదవండి. Bengaluru: వక్క.. లాభాలు పక్కా....


ఆరు నెలలక్రితం ఫేస్‌బుక్‌ ద్వారా శ్వేతాగౌడ పరిచయమని, ఆ తర్వాత సమాజసేవ చేస్తున్నానంటూ మాట్లాడారన్నారు. ఒకటి రెండు సందర్భాల్లో భేటీ అయ్యామన్నారు. బహుమతి అంటూ బ్రాస్‌లెట్‌, ఉంగరం ఇచ్చారని పోలీసులకు వర్తూరు వివరించారు. వాటిని పోలీసులకు ఇచ్చారు. 12.50 లక్షల రూపాయల నగదు కూడా వాపసు చేశారు. తన పేరు చెప్పి ఏకంగా రూ.2కోట్ల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారనే విషయం వ్యాపారి ఫోన్‌ చేసేవరకు తెలియదన్నారు. తనతోపాటు పలువురు రాజకీయ నాయకులతో ఫొటోలు తీసుకుని మోసం చేసినట్లు తెలుస్తోందన్నారు.


pandu3.2.jpg

కాగా శ్వేతాగౌడ ఫోన్‌లో వర్తూరు ప్రకాశ్‌ పేరును గులాబ్‌జామ్‌గాను, బీజేపీ నాయకుడు చలపతి పేరును మైసూరుపాక్‌గా, మరో వ్యక్తి పేరు రసగుల్లాగా నమోదు చేసినట్లు గుర్తించారు. వర్తూరు ప్రకాశ్‌ పలు బంగారు దుకాణాలకు శ్వేతాగౌడతో కలసి వెళ్లినట్లు తెలుస్తోంది. బంగారం వ్యాపారి సంజయ్‌బాప్నా మాట్లాడుతూ.. తమ వద్ద ఆభరణాల కొనుగోలుకు వర్తూరు ప్రకాశ్‌, శ్వేతాగౌడ ఇద్దరూ వచ్చారని తొలిసారి డబ్బు చెల్లించారన్నారు. మేం వర్తూరు ప్రకాశ్‌ ఇంటికే ఆభరణాలు డెలివరీ చేశామని, ఆ తర్వాత శ్వేతాగౌడ రూ.2.9 కిలోల ఆభరణాలు తీసుకుని, నగదు ఇవ్వకుండా మోసం చేశారన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: తప్పయిపోయింది!

ఈవార్తను కూడా చదవండి: Ponguleti: తప్పు జరిగితే.. వేటు తప్పదు!

ఈవార్తను కూడా చదవండి: నేడు, రేపు మోస్తరు వర్షాలు

ఈవార్తను కూడా చదవండి: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 25 , 2024 | 01:27 PM