Bengaluru: ఉద్యోగం వీడి.. ఉద్యాన సాగు వైపు..
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:42 PM
వ్యవసాయం అంటేనే యువత మొహం చాటేస్తున్నా, సాగునే జీవనాధారంగా చేసుకుని లాభాలు గడిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు సండూరు తాలూకా పరిధిలోని తాళూరు గ్రామానికి చెందిన యువ రైతు బసవరాజు(Basavaraju). ఐటీఐ చదివిన బసవరాజు జిందాల్ కంపెనీలో పనిచేసేవాడు.
- తైవాన్ పింక్ జామతో లాభాలు గడిస్తున్న యువరైతు
- అధికారుల సూచనలతో అధిక రాబడి..
బళ్లారి(బెంగళూరు): వ్యవసాయం అంటేనే యువత మొహం చాటేస్తున్నా, సాగునే జీవనాధారంగా చేసుకుని లాభాలు గడిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు సండూరు తాలూకా పరిధిలోని తాళూరు గ్రామానికి చెందిన యువ రైతు బసవరాజు(Basavaraju). ఐటీఐ చదివిన బసవరాజు జిందాల్ కంపెనీలో పనిచేసేవాడు. చాలీచాలని జీతంతో ఉద్యోగంపై ఆసక్తి కనబరచలేదు. ఉద్యోగం మాని ఉద్యానసాగు వైపు అడుగుటు వేశాడు. తమకున్న మూడు ఎకరాల పొలంలోనే ఉద్యాన పంటలు సాగుచేసి అందరిచేత హౌరా..! అనిపిస్తున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: ప్రాణాలు తీసిన ‘వీలింగ్’..
మొదట జొన్న, మొక్కజొన్న, వరి, ఉల్లి తదితర పంటలు సాగుచేసి నష్టాలు చూసిన బసవరాజు ఉద్యానవన శాఖ అధికారుల సూచనలతో థైవాన్ జామసాగును చేపట్టి నష్టాలనుంచి గట్టెక్కాడు. తనకున్న వర్షాధారిత భూమిలో తైవాన్ పింక్ రకానికి చెందిన జామను మూడు ఎకరాల్లో సాగు చేశాడు. ప్రస్తుతం అధిక దిగుబడి వచ్చిందని హర్షం వ్యక్తం చేస్తున్నాడు. రాయచూరు(Rayachuru)లోని ప్రైవేట్ ఫారం నుంచి రూ.50వేలకు వెయ్యి తైవాన్ జామ మొక్కలను తీసుకొచ్చారు. మొక్కకు ఏడు అడుగుల నిడివి చొప్పున, ప్రతి వరుసకు 8 అడుగుల చొప్పున మొక్కలు నాటాడు.
మొక్కలకు రసాయనిక ఎరువులు ఉపయోగించకుండా, కేవలం సేంద్రియ ఎరువును వేస్తూ సాగుచేయడం ద్వారా ప్రతి జామపండు 500 గ్రాములు బరువుతో అధిక ఉత్పత్తి వచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నాడు. పంటను బెంగళూరు, మైసూరు(Bangalore, Mysore) తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ అధిక లాభాలు గడిస్తున్నాడు. సాగునీటి బోరు ద్వారా లభించే నీటితోనే వ్యవసాయ శాఖ సహకారంతో డ్రిప్ ఇరిగేషన్ పద్దతిని ఉపయోగించడంతో పాటు పశువులు, పక్షుల బారి నుంచి కాపాడేందుకు పొలం చుట్టూ కంచెవేసినట్లు తెలిపారు.
యువ రైతులు సాగుకు ముందుకు రావాలి..
వ్యవసాయాన్ని వదిలి ఆధునిక జీవనానికి అలవాటు పడి నగరాల వైపు మక్కువ చూపుతున్న నేటి యువరైతులకు బసవరాజు ఆదర్శంగా నిలిచాడు. వ్యవసాయ సాగుతో పాటు రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలతో సాగుచేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో సాగుపై యువత ఆసక్తి చూపాలి.
- హనుప్పనాయక, ఉద్యానవన శాఖాధికారి
ఈవార్తను కూడా చదవండి: 2025 Calendar: 2025 ఏడాదికి సెలవులు ఖరారు
ఈవార్తను కూడా చదవండి: సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న లగచర్ల రైతులు
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ..
ఈవార్తను కూడా చదవండి: దారుణం.. రక్షించాల్సిన వారే ప్రాణాలు కోల్పోయారు..
Read Latest Telangana News and National News