Share News

Bengaluru: ఆ ముగ్గురు మంత్రుల భేటీ వెనుక ఉన్న మతలబు ఏమిటో...

ABN , Publish Date - Oct 03 , 2024 | 01:39 PM

ముడా వివాదంలో సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah)కు కేసుల కష్టాలు బిగుసుకుంటున్న తరుణంలో మంత్రుల రహస్యభేటీ కాంగ్రెస్‏లో కలకలం రేపుతోంది. కారణాలు ఏవైనా రహస్యంగా సమావేశం కావడం పలువురు మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులను విస్మయం కలిగిస్తోంది.

Bengaluru: ఆ ముగ్గురు మంత్రుల భేటీ వెనుక ఉన్న మతలబు ఏమిటో...

- మంత్రులు పరమేశ్వర్‌, మహదేవప్ప, సతీశ్‌జార్కిహొళి భేటీ

- మరోమారు తెరపైకి సీఎం మార్పు అంశం..?

- ఉప ఎన్నికలపై చర్చించాం

- ఈడీ, ముడా అంశాలు చర్చకు రాలేదు

- సీఎంతోపాటు అందరూ కలిసే ఉన్నాం

- మంత్రి సతీశ్‌జార్కిహొళి

బెంగళూరు: ముడా వివాదంలో సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah)కు కేసుల కష్టాలు బిగుసుకుంటున్న తరుణంలో మంత్రుల రహస్యభేటీ కాంగ్రెస్‏లో కలకలం రేపుతోంది. కారణాలు ఏవైనా రహస్యంగా సమావేశం కావడం పలువురు మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులను విస్మయం కలిగిస్తోంది. బీజేపీ-జేడీఎస్‌(BJP-JDS) నాయకులు ముఖ్యమంత్రితోపాటు కాంగ్రెస్‌ పార్టీకి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నా వాటి గురించి ఒకరిద్దరు తప్ప మంత్రులెవరూ నోరు మెదపడం లేదు. మరోవైపు రహస్య సమావేశాల వెనుక భారీ అజెండానే ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా మంగళవారం రాత్రి హోం మంత్రి పరమేశ్వర్‌, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మహదేవప్ప, ప్రజాపనులశాఖ మంత్రి సతీశ్‌ జార్కిహొళిలు భేటీ అయ్యారు.


వీరు ప్రస్తుతం కేబినెట్‌లో కీలకమైన మంత్రులు. ఇప్పటికే పరమేశ్వర్‌ తాను సీఎం రేసులో ఉన్నానని దాదాపు నిరూపించుకున్నారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీతో ప్రత్యేక సమావేశం కావడం, సదరు విషయాలను బహిరంగంగా చెప్పలేనంటూ ప్రకటించారు. మరోవైపు సతీశ్‌జార్కిహొళి ఆగస్టు రెండోవారం తర్వాత నుంచి సెప్టెంబరు రెండోవారం దాకా నాలుగైదుసార్లు ఢిల్లీకి వెళ్లొచ్చారు. ప్రతిసారి పరమేశ్వర్‌తో చర్చలు జరిపాకనే జార్కిహొళి ఢిల్లీ వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల హోం మంత్రి పరమేశ్వర్‌, డీసీఎం డీకే శివకుమార్‌(DCM DK Shivakumar)లు ప్రత్యేకంగా భేటీ అయిన విషయం మరువకముందే ముగ్గురు మంత్రుల కలయిక కాంగ్రె్‌సలో కుతూహలం రేకెత్తిస్తోంది. దళిత ముఖ్యమంత్రి అంశం అప్పుడప్పుడు తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే.


pandu2.jpg

మంత్రి మహదేవప్ప ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు అత్యంత ఆప్తుడనే విషయం తెలిసిందే. సిద్దరామయ్యను వీడి మహదేవప్ప రాజకీయం చేసే ఆలోచన లేదనేది ఇప్పటివరకు సాగింది. అయితే సీఎం సిద్దరామయ్యపై లోకాయుక్త విచారణకు ముందే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కూడా రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. లోకాయుక్త కంటే ముందే సిద్దరామయ్యను ఈడీ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆదివారం ముడా వివాదంలో ఫిర్యాదుదారుడు స్నేహమయికృష్ణకు ఈడీ నోటీసులు ఇచ్చింది. గురువారం విచారణకు హాజరు కావాలని కోరింది. మరోవైపు అన్నివైపులా ఒత్తిడి వస్తే సీఎం రాజీనామా అనివార్యం కానుందని పార్టీలోనే గుసగుసలు ఆరంభమయ్యాయి.


కాగా ముగ్గురు మంత్రుల భేటీ విషయమై సతీశ్‌జార్కిహొళి మీడియాతో సంచలనమైన అంశాలు ప్రస్తావించారు. ముడా కేసులో సీఎం రాజీనామా చేస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని పలువురు మంత్రులు భావిస్తున్నారన్నారు. తమ వద్ద ప్లాన్‌ ఏ, ప్లాన్‌ బీలు లేవని డైరెక్ట్‌గా ప్లాన్‌ సీని అమలులోకి తెస్తామన్నారు. ముగ్గురు భేటీలో ప్రత్యేకతలేదని రాష్ట్రంలోని పలు అంశాలతోపాటు రాబోయే ఉపఎన్నికల గురించి చర్చించుకున్నామని స్పష్టం చేశారు. తమ భేటీలో ఈడీ, ముడా అంశాలు ప్రస్తావనకు రాలేదన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కలిసే ఉన్నామని, ఆయనను వదులుకునే ప్రసక్తే లేదన్నారు. కాగా సీఎం రాజీనామా అనివార్యమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ డీకే శివకుమార్‌కు అవకాశం లభించకుండా కట్టడి చేసేందుకే ఇటువంటి ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం.


...................................................................

ఈ వార్తను కూడా చదవండి:

.......................................................................

Chennai: మళ్లీ పెరిగిన వెల్లుల్లి ధర.. కిలో ఎంతంటే...

చెన్నై: దిగుమతులు తగ్గడంతో వెల్లుల్లి ధరలు మళ్లీ పెరిగాయి. మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్తాన్‌(Madhya Pradesh, Gujarat, Rajasthan), ఒడిశా, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా తదితర రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని దిండుగల్‌(Dindugal)లో కొండ వెల్లుల్లి సాగు చేస్తుంటారు. ప్రతి ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో జూన్‌, జూలెలో సాగు ప్రారంభించి సెప్టెంబరులో కోత చేపడుతుంటారు. ఈ నేపథ్యంలో, ఆయా రాష్ట్రాల్లో వర్షాలు, నీటి కొరత కారణంగా వెల్లుల్లి దిగుబడులు తగ్గాయి. దీంతో కోయంబేడు మార్కెట్‌(Koyambedu Market)కు వెల్లుల్లి దిగుమతి తగ్గడంతో మొదటి రకం వెల్లుల్లి కిలో రూ.350, రెండో రకం రూ.300, మూడవ రకం కిలో రూ.260కి విక్రమవుతోంది. త్వరలో విజయదశమి, దీపావళి పండుగలు రానున్న నేపథ్యంలో, వీటి ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు పేర్కొంటున్నారు.


ఇదికూడా చదవండి: Konda Surekha: విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. దిగొచ్చిన కొండా సురేఖ.. ఏమన్నారంటే

ఇదికూడా చదవండి: Hyderabad: కేసీఆర్‌, కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు

ఇదికూడా చదవండి: KTR: ఈ దొంగ ఏడుపులు దేనికి?

ఇదికూడా చదవండి: Sridhar Babu: హైదరాబాద్‌లో ఆర్‌ఎక్స్‌ బెనిఫిట్స్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌

Read Latest Telangana News and National News

Updated Date - Oct 03 , 2024 | 01:39 PM