Bihar: కోడలిని పెళ్లాడిన అత్త..!!
ABN , Publish Date - Aug 12 , 2024 | 09:53 PM
దేశంలో కొన్ని ప్రాంతాలు పాశ్చాత్య ధోరణి వైపు మళ్లుతున్నాయి. నగరాలు, పట్టణాలే కాదు గ్రామాల్లోకి ఈ సంస్కృతి చేరింది. సేమ్ సెక్స్ మ్యారేజ్‌కు కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. బీహార్‌లో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి సంబంధించిన వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పెళ్లిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కృతి సంప్రదాయాలను మంట గలిపారని విరుచుకుపడ్డారు.
గోపాల్ గంజ్: దేశంలో కొన్ని ప్రాంతాలు పాశ్చాత్య ధోరణి వైపు మళ్లుతున్నాయి. నగరాలు, పట్టణాలే కాదు గ్రామాల్లోకి ఈ సంస్కృతి చేరింది. సేమ్ సెక్స్ మ్యారేజ్‌కు కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. బీహార్‌లో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి సంబంధించిన వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పెళ్లిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కృతి సంప్రదాయాలను మంట గలిపారని విరుచుకుపడ్డారు.
కోడలితో అత్త పెళ్లి
గోపాల్ గంజ్ జిల్లా బెల్వకు చెందిన అత్త, మేనకోడలిని పెళ్లి చేసుకుంది. తన భర్తకు విడాకులు ఇచ్చి మరి వివాహం చేసుకుంది. ఓ గుడిలో హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది. కోడలి మెడలో అత్త తాళి కట్టింది. అగ్నిగుండం వద్ద ఇద్దరు ఏడు అడుగులు వేశారు. తర్వాత ఒకరికొకరు పూలమాల వేసుకున్నారు. ‘మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. గత మూడేళ్ల నుంచి కలిసి ఉంటున్నాం. వివాహ బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయం తీసుకొని ముందడుగు వేశాం అని’ ఆ జంట ప్రకటించింది.
ఖండించిన బంధువులు
ఆ పెళ్లిని బంధువులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. సమాజంలో తమకున్న గౌరవాన్ని తగ్గిస్తున్నారని మండిపడ్డారు. మీ తీరు వల్ల తమ పేరు, ప్రఖ్యాతలు మంటగలిశాయని విరుచుకుపడ్డారు. కుటుంబసభ్యులు, బంధువులు ఎవరు, ఏమి అనుకున్నా ఫర్లేదు అని ఆ జంట ముందుకెళుతోంది. వారికి ఓ పెద్దావిడ మాత్రం అండగా నిలిచారు. ఇద్దరికీ ఆశీర్వాదం ఇచ్చి, చల్లగా జీవించాలని దీవించారు.