Share News

Bike taxi: బైక్‌ టాక్సీల వేగానికి కళ్ళెం..

ABN , Publish Date - Dec 12 , 2024 | 11:12 AM

రాష్ట్రంలో అడ్డూ అదుపూ లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న బైక్‌ టాక్సీ(Bike taxi)లను అదుపు చేయడానికి రాష్ట్ర రవాణా శాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లఘించే బైక్‌ టాక్సీలను స్వాధీనం చేసుకోవడంతో పాటు వాటిని నడిపేవారికి కూడా జరిమానా విధిస్తామని రవాణాశాఖాధికారులు హెచ్చరించారు.

Bike taxi: బైక్‌ టాక్సీల వేగానికి కళ్ళెం..

- నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

- రవాణా శాఖ అధికారుల హెచ్చరిక

చెన్నై: రాష్ట్రంలో అడ్డూ అదుపూ లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న బైక్‌ టాక్సీ(Bike taxi)లను అదుపు చేయడానికి రాష్ట్ర రవాణా శాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లఘించే బైక్‌ టాక్సీలను స్వాధీనం చేసుకోవడంతో పాటు వాటిని నడిపేవారికి కూడా జరిమానా విధిస్తామని రవాణాశాఖాధికారులు హెచ్చరించారు. రాజధాని నగరం చెన్నై సహా పలు నగరాల్లో ఆటోలు, టాక్సీల్లో ప్రయాణించినవారంతా ప్రస్తుతం తక్కువ ఛార్జీతో బైక్‌ట్యాక్సీలపై వెళ్లటం ఆనవాయితీగా మారింది. దీంతో యేళ్లతరబడి ఆటోలను నడుపుతున్న కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Minister: ఆ కొండపైకి భక్తులకు అనుమతి లేదు..


ఈ నేపథ్యంలో బైక్‌ టాక్సీలు ప్రయాణికులను తీసుకెళ్లటానికి బదులుగా వాణిజ్యపరమైన కార్యకలాపాలకు కూడా వినియోగిస్తున్నారు. ఓ వైపు నిరుద్యోగ యువకులు, విద్యార్థులు ఈ బైక్‌ టాక్సీలు నడపటం ద్వారా జీవితంలో నిలదొక్కుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఈ బైక్‌టాక్సీలు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం లేదని, ఆటో స్టాండ్లలో సంచరిస్తూ ప్రయాణికులను తక్కువ ఛార్జీతో తమ బైకు ఎక్కమని ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులు ఆటో కార్మిక సంఘాల నాయకులంతా ప్రాంతీయ రవాణా అధికారులకు బైక్‌ టాక్సీలపై ఫిర్యాదు చేశారు.


nani3.3.jpg

డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని కుర్రాళ్లంతా బైకులను రేస్‌ బైకుల్లా అత్యంత వేగంగా నడుపుతున్నారని, ఆటోలను ఆశ్రయించే ప్రయాణికులను మాయమాటలు చెప్పి బైకుల్లో తరలించుకపోయి తమ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. ఆటో కార్మిక సంఘాల విజ్ఞప్తిని పరిశీలించిన ప్రాంతీయ రవాణా అధికారులు బైక్‌ టాక్సీల వేగానికి కళ్లెం వేయాలని నిర్ణయించారు. ఇకపై రోజూ నగరంలో తిరిగే బైక్‌ టాక్సీలపై పోలీసులు నిఘా వేయాలని, మోటారు సైకిళ్లు, స్కూటీలు కండిషన్‌గా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలన్నారు.


ట్రాఫిక్‌ నిబంధనలను బైక్‌ టాక్సీలు తప్పక పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ నిబంధనలు బుధవారం నుండే అమలులోకి వస్తాయన్నారు. ఆహార వస్తువులను తీసుకెళ్లే బైకులను తనిఖీ చేయకూడదని, అదే సమయంలో ఆ బైకుల్లో పరిమితికి మించిన బరువుతో సరకులు తీసుకెళ్తే వాహనాన్ని సీజ్‌ చేయాలని పేర్కొన్నారు.


ఈ విషయమై రవాణా శాఖ మంత్రి శివశంకర్‌(Minister Sivashankar) మాట్లాడుతూ... బైక్‌ టాక్సీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని, అయితే రాష్ట్రంలో ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా వాటిని నడుపుతుండటం వల్లే ప్రాంతీయ రవాణాధికారులు చర్యలు చేపట్టనున్నారని తెలిపారు. ఇటీవల కాలంలో ఇన్సూరెన్స్‌, ఆర్సీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా బైక్‌ టాక్సీ నడుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ కారణాల వల్లే ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే బైక్‌ టాక్సీలపై కఠిన చర్యలు తీసుకోనున్నామని ఆయన చెప్పారు.


ఈవార్తను కూడా చదవండి: Special Trains: శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు: ద.మ. రైల్వే

ఈవార్తను కూడా చదవండి: హాస్టల్‌ ఫుడ్‌ పాయిజన్‌ ఘటనల్లో.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై అనుమానాలు

ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల సమస్యలు పట్టవా రేవంత్‌: కవిత

ఈవార్తను కూడా చదవండి: ఉత్తమ పార్లమెంటేరియన్‌ తరహాలో ఏటా ఉత్తమ లెజిస్లేచర్‌ అవార్డు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 12 , 2024 | 11:12 AM