Share News

Srinagar Encounter: బిస్కెట్లను తెలివిగా ఉపయోగించి ఆపరేషన్‌ను సక్సెస్ చేసిన బలగాలు

ABN , Publish Date - Nov 03 , 2024 | 06:28 PM

సహజంగా ఉగ్రవాదుల ఆచూకీ కోసం బలగాలు వెళ్లినప్పుడు వీధి జాగిలాల సమస్య ఉంటుంది. ఇవి మొరిగితే ఉగ్రవాదులు అప్రమత్తమవుతుంటారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా లక్ష్యం దిశగా వెళ్తున్నంత సేపూ బృందాలు తగినన్ని బిస్కట్లు అందుబాటులో ఉంచుకున్నాయి.

Srinagar Encounter: బిస్కెట్లను తెలివిగా ఉపయోగించి ఆపరేషన్‌ను సక్సెస్ చేసిన బలగాలు

శ్రీనగర్: లష్కరే తొయిబా (Lashkar-e-Taiba)కు చెందిన పాకిస్థాన్ కమాండర్‌ ఉస్మాన్ (Usaman)ను శ్రీనగర్‌లో శనివారంనాడు మట్టుబెట్టడంలో భద్రతా బలగాలు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. అనుకున్నది అనుకున్నట్టుగా తమ వ్యూహాన్ని అమలు చేయగలిగాయి. ఈ ఆపరేషన్ సక్సె్స్ వెనుక 'బిస్కట్ల' పాత్ర కూడా ఉందట.

Jammu And Kashmir: మార్కెట్‌పై ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి.. పలువురికి గాయాలు


సహజంగా ఉగ్రవాదుల ఆచూకీ కోసం వెళ్లనప్పుడు వీధి జాగిలాలు మొరుగుతుంటాయి. దీంతో ఉగ్రవాదులు అప్రమత్తమవుతుంటారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా లక్ష్యం దిశగా వెళ్తున్నంత సేపూ బృందాలు తగినన్ని బిస్కట్లు అందుబాటులో ఉంచుకున్నాయి. దారిపొడవునా వాటికి బిస్కె్ట్లు అందిస్తూ వచ్చాయి. బలగాల ఆపరేషన్ మొత్తం శనివారం తెల్లవారుజాముకు ముందే జరిగింది. దాదాపు 30 ఇళ్లను వారు రౌండాఫ్ చేశారు. పలు గ్రెనేడ్లు, చేతిలో ఏకే-47 కలిగిన ఉస్మాన్ తొలుత కాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్ మొదలైంది. బలగాలు ప్రతికాల్పులతో విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో పాతిపెట్టిన పలు గ్రనేడ్ల కారణంగా ఉస్మాన్ ఆశ్రయం పొందిన ఇంటికి నిప్పంటుకుంది. అయితే మంటలు చుట్టుపక్కల భవంతులకు విస్తరించకుండా బలగాలు వెంటనే అదుపులోకి తెచ్చాయి. కొద్ది గంటలసేపు హోరాహోరీ కాల్పుల అనంతరం ఉస్మాన్‌ను బలగాలు మట్టుబెట్టగా, నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ప్రస్తుత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్ల పరిస్థితి నిలకడగా ఉంది. స్థానిక పోలీసులు, సీఆర్‌పీఎప్ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి.


ఉస్మాన్ 2000 నుంచి జమ్మూకశ్మీర్‌లో జరిగిన పలు ఉగ్రవాద ఘటనల్లో కీలక పాత్ర పోషించినట్టు అధికారులు తెలిపారు. పాకిస్థాన్‌లో శిక్షణ అనంతరం 2016-2017లో జమ్మూకశ్మీర్‌లోకి తిరిగి చొరబడిన ఉస్మాన్ గత ఏడాది పోలీస్ ఇన్‌స్పెక్టర్ మస్రూస్ వనిపై జరిపిన కాల్పుల్లో కీలకంగా వ్యవహరించాడు.


ఇవి కూడా చదవండి:

No Cash Payments: పెట్రోల్ పంప్, సూపర్ మార్కెట్లలో నగదు చెల్లింపులు బంద్.. పోలీసుల ప్రకటన

Hemant Soren: మేము గెలిస్తే నెలకు 7 కేజీల రేషన్, పీంఛన్ పెంపు చేస్తాం

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 03 , 2024 | 06:45 PM