Rahul Gandhi: ఇది ప్రతీకార చర్యే.. రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు
ABN , Publish Date - Feb 25 , 2024 | 09:36 PM
అహ్మద్ పటేల్ (Ahmed Patel) కంచుకోట అయిన భరూచ్ (Bharuch) సీటుని ఆమ్ ఆద్మీ పార్టీకి (Aam Admi Party) కట్టబెట్టడంపై కాంగ్రెస్ పార్టీపై (Congress) బీజేపీ (BJP) విమర్శలు గుప్పించింది. ఇది రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రతీకార చర్యేనని బీజేపీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ (Jaiveer Shergill) ఆరోపించారు. అహ్మద్ పటేల్, రాహుల్ గాంధీ మధ్య విభేదాలు ఉండగా.. అందుకు ప్రతీకారంగానే ఆయన కంచుకోటను ఆప్‌కు అప్పగించారని మండిపడ్డారు.
అహ్మద్ పటేల్ (Ahmed Patel) కంచుకోట అయిన భరూచ్ (Bharuch) సీటుని ఆమ్ ఆద్మీ పార్టీకి (Aam Admi Party) కట్టబెట్టడంపై కాంగ్రెస్ పార్టీపై (Congress) బీజేపీ (BJP) విమర్శలు గుప్పించింది. ఇది రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రతీకార చర్యేనని బీజేపీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ (Jaiveer Shergill) ఆరోపించారు. అహ్మద్ పటేల్, రాహుల్ గాంధీ మధ్య విభేదాలు ఉండగా.. అందుకు ప్రతీకారంగానే ఆయన కంచుకోటను ఆప్‌కు అప్పగించారని మండిపడ్డారు. ఇదే సమయంలో.. మరో బీజేపీ నేత అమిత్ మాల్వియా (Amit Malviya) సైతం విరుచుకుపడ్డారు. గాంధీల కుటుంబం యూజ్ అండ్ త్రో విధానాన్ని పాటిస్తారని.. అందుకే సీట్ల పంపకాల విషయంలో భరూచ్ స్థానాన్ని ఆప్‌కు ఇచ్చారని అన్నారు.
‘‘అహ్మద్ పటేల్, రాహుల్ గాంధీ మధ్య విభేదాలు ఉన్న విషయం అందరికీ తెలుసు. అహ్మద్ పటేల్ వారసత్వాన్ని తుడిచిపెట్టి, ఆయన కుటుంబాన్ని అవమానపరిచే ప్రయత్నంలో భాగంగానే.. అహ్మద్ కంచుకోటను ఆప్‌కు కట్టబెట్టారు. గాంధీ కుటుంబం కేవలం యూజ్ అండ్ త్రో విధానాన్ని పాటిస్తుంది’’ అని మాల్వియా ట్వీట్ చేశారు. ఇందుకు అహ్మద్ పటేల్ కుమార్తె ముంతాజ్ పటేల్ (Mumtaz Patel) పెట్టిన పోస్టును ట్యాగ్ చేశారు. ఆ పోస్టులో.. అలయన్స్‌లో భాగంగా లోక్‌సభ (Lok Sabha) సీటును కేటాయించలేదని, ఇందుకు పార్టీ క్యాడర్‌కు క్షమాపణలు చెప్తున్నానని ఆమె అన్నారు. ఇది నిరాశపరిచే విషయమేనని, అయితే కలిసికట్టుగా కాంగ్రెస్‌ను బలోపేతాం చేద్దామని పిలుపునిచ్చారు. అహ్మద్ పటేల్ 45 ఏళ్ల వారసత్వాన్ని వృథా కానివ్వమని పేర్కొన్నారు.
ఇదిలావుండగా.. కాంగ్రెస్ ప్రధాన ట్రబుల్ షూటర్‌గా అహ్మద్ పటేల్ పేరు పొందారు. 1976లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గుజరాత్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ, పార్లమెంట్‌లో ప్రాతినిథ్యం వహించారు. పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు.. ఆయనే సమస్యలను పరిష్కరించేవారు. కొవిడ్ కారణంగా 2020లో చనిపోయే వరకూ.. కాంగ్రెస్ కోసం ఆయన పాటుపడ్డారు.