బెంగళూరు పాలికెలో రూ.46వేల కోట్ల అక్రమాలు!
ABN , Publish Date - Nov 27 , 2024 | 02:56 AM
బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) పరిధిలోని రోడ్ల నిర్వహణలో భారీ అక్రమాలకు పాల్పడ్డారని బీజేపీ నేత ఎన్‌ఆర్ రమేశ్.. ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
బెంగళూరు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) పరిధిలోని రోడ్ల నిర్వహణలో భారీ అక్రమాలకు పాల్పడ్డారని బీజేపీ నేత ఎన్‌ఆర్ రమేశ్.. ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. 2013-14 నుంచి 2023-24 వరకు తొమ్మిదిన్నరేళ్ల వ్యవధిలో బీబీఎంపీలో రోడ్ల పర్యవేక్షణ, అభివృద్ధి కోసం రూ.46,300 కోట్ల గ్రాంట్లు విడుదల కాగా.. ఇందులో 75శాతం దుర్వినియోగం అయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు 4,113 పేజీల వివరాలతో ఈడీ అధికారులకు మంగళవారం సమర్పించారు. బీబీఎంపీ చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్‌తోపాటు పాలనాధికారులైన ఉమాశంకర్ సహా 18 మంది ఐఏఎస్ అధికారులకు ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.