Subramanian Swamy: మోదీకి ఆ చెడు అలవాటు.. బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 25 , 2024 | 12:54 PM
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి(Subramanian Swamy) గత కొంత కాలంగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)పై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి(Subramanian Swamy) గత కొంత కాలంగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)పై విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అప్పట్లో విధించిన ఎమర్జెన్సీ గురించి మోదీ మాట్లాడటంపై ఆయన స్పందించారు.
"ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మోదీ పోరాడలేదు. ఆ సమయంలో ఆయన గుజరాత్‌లో ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా ఉన్నారు. బాబుభాయ్ నేతృత్వంలోని జనతా మోర్చా సర్కార్ గుజరాత్‌లో ఉన్న కారణంగా రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు రాలేదు. ఇలాంటి అంశాల్లో క్రెడిట్ కొట్టేయాలనే ఓ చెడ్డ అలవాటు మోదీకి ఉంది" అని సుబ్రహ్మణ్య స్వామి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.
నీట్ లీక్‌పైనా..
దేశ వ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ సంచలన సృష్టిస్తున్న వేళ సుబ్రహ్మణ్య స్వామి బీజేపీపై విమర్శలు గుప్పించారు. "పార్లమెంటులో మెజారిటీ లేని ప్రభుత్వం ఉంది. దేశంలో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఎవరు గెలిచినా విద్యార్థుల కష్టాలు పట్టించుకోరు? పిల్లల జీవితాలతో ఆడుకోవడం, వారి కలలను నాశనం చేయడమే వారి పని"అని సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా స్పందించారు.
For Latest News and National News click here