Ram Mandir: అయోధ్య రామమందిరంపై పార్లమెంటులో తీర్మానం.. ప్రవేశపెట్టనున్న బీజేపీ ఎంపీలు
ABN , Publish Date - Feb 10 , 2024 | 10:26 AM
అయోధ్య రామమందిరంపై(Ayodhya Ram Mandir) శనివారం లోక్ సభలో చర్చ జరగనుంది. బీజేపీ(BJP) ఎంపీలు సత్యపాల్ సింగ్, ప్రతాప్ చంద్ర సారంగి, సంతోష్ పాండే రామమందిర తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
ఢిల్లీ: అయోధ్య రామమందిరంపై(Ayodhya Ram Mandir) శనివారం లోక్ సభలో చర్చ జరగనుంది. బీజేపీ(BJP) ఎంపీలు సత్యపాల్ సింగ్, ప్రతాప్ చంద్ర సారంగి, సంతోష్ పాండే రామమందిర తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభలో ఎంపీలు కె.లక్ష్మణ్, సుదాన్షు త్రివేది, రాకేష్ సిన్హా తీర్మానం ప్రవేశపెడతారు.
అనంతరం రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠపై బీజేపీ ఎంపీలు చర్చను లేవనెత్తనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ(PM Modi) ఉభయసభల్లో మాట్లాడనున్నారు. సత్యపాల్ సింగ్ మందిర నిర్మాణం, ప్రాణ ప్రతిష్ఠపై చర్చను ప్రారంభిస్తారని లోక్ సభ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. శనివారంతో బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి