Annamalai: కొరడాతో కొట్టుకుని బీజేపీ అధ్యక్షుడి నిరసన..వీడియో
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:51 AM
తమిళనాడులో ఉన్న అన్నా యూనివర్శిటీకి చెందిన లైంగిక వేధింపుల కేసులో న్యాయం చేయాలంటూ, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ నిరసనలో భాగంగా, ఆయన స్వయంగా తన ఇంటి బయట ఆరు కొరడా దెబ్బలు కొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అన్నా యూనివర్శిటీలో ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో న్యాయం చేయాలంటూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై (Annamalai) వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ క్రమంలో స్వయంగా ఆయన తన ఇంటి బయట ఆరు కొరడా దెబ్బలు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తాను చెప్పులు వేసుకోనని, చెప్పులు లేకుండా నడుస్తానని అన్నామలై సవాల్ చేశారు. అధికార పార్టీ ఈ కేసును క్రమంగా పక్కదారి పట్టించేలా చేస్తుందని వ్యాఖ్యానించారు.
బయటనే నిందితుడు
ఈ నిరసన చర్యలో అన్నామలై తన ఆగ్రహాన్ని, రాష్ట్రంలో ఉన్న డీఎంకే ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తం చేశారు. దీంతో అన్నా యూనివర్శిటీలో లైంగిక వేధింపుల కేసు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో నిందితుడు ఇంకా బయట ఉన్నప్పటికీ, న్యాయపరమైన చర్యలు ఆలస్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుడు అన్నామలై ఈ కేసులో న్యాయం కావాలని పట్టు పట్టారు. ఈ కేసులో నిందితుడు డీఎంకే నాయకులతో సంబంధం ఉన్నట్లు అన్నామలై ఆరోపించారు. ఆయన నిందితుడితో ఉన్న ఫొటోల్ని ప్రదర్శించి, డీఎంకే విద్యార్థి విభాగం ఆధిపత్యంలో ఉన్న ఓ ఆఫీస్ బేరర్ అని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో కామెంట్లు
దీనికి తోడు నిందితుడు డీఎంకే అధికార పార్టీకి సంబంధించిన ప్రజా నాయకుడని అన్నామలై పేర్కొన్నారు. ఈ ఘటనపై అనేక మంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. తమిళనాడు న్యాయశాఖ మంత్రి ఎస్. యూనివర్సిటీ విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడు డీఎంకే పార్టీ ప్రాథమిక సభ్యుడు కాదని రేగుపతి అన్నారు. ఆ 37 ఏళ్ల నిందితుడిపై ఇప్పటికే కనీసం 10 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు జ్ఞానశేఖరన్ బాధితురాలిని బెదిరించాడని, ఆమె తనను కలవడానికి రావాలని చెప్పాడని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా జాతీయ మహిళా కమిషన్ ఈ ఘటన విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
మహిళా కమిషన్ ఆదేశాలు
ఇదిలా ఉండగా జాతీయ మహిళా కమిషన్ ఈ ఘటన విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే నిందితుడు జ్ఞానశేఖరన్‌పై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌ల కాపీలు, అటువంటి కేసులలో తీసుకున్న చర్యల వివరాలను పంపాలని కమిషన్ డీజీపీని కోరింది. బాధితురాలి గుర్తింపు వివరాలను పోలీసులు బహిరంగపరిచారని, బాధితురాలి గుర్తింపును వెల్లడించినందుకు ఆయా పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ పేర్కొంది. దీంతోపాటు ఎఫ్‌ఐఆర్ కాపీల ద్వారా బాధితురాలి సమాచారాన్ని పోలీసులు వెల్లడించడాన్ని ఏఐఏడీఎంకే, బీజేపీ, సీపీఐ(ఎం) సహా పలు పార్టీలు ఖండించాయి.
ఇవి కూడా చదవండి:
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Manmohan Singh Net Worth: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసా..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Read More National News and Latest Telugu News