Share News

Navneet Rana:‘అసదుద్దీన్ ఒవైసీ’పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ.. ఎందుకంటే..?

ABN , Publish Date - Jun 27 , 2024 | 06:17 PM

ఎంపీగా ప్రమాణం చేస్తూ జై పాలస్తీన అంటూ వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అమరావతి మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి నవనీత్ రాణా గురువారం లేఖ రాశారు.

Navneet Rana:‘అసదుద్దీన్ ఒవైసీ’పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి  లేఖ.. ఎందుకంటే..?
BJP Leader Navneet Rana

ముంబై, జూన్ 27: ఎంపీగా ప్రమాణం చేస్తూ జై పాలస్తీన అంటూ వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అమరావతి మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి నవనీత్ రాణా గురువారం లేఖ రాశారు. ఒవైసీ తన ప్రమాణం స్వీకార కార్యక్రమంలో 'జై పాలస్తీనా' నినాదాన్ని లేవనెత్తడం ద్వారా భారత్‌కు బదులుగా మరో దేశానికి విధేయతను వ్యక్తం చేశారని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. అయితే తన డిమాండ్‌కు మద్దతుగా రాజ్యాంగంలోని 102, 103 ప్రకరణలను ఈ సందర్భంగా ఆమె ఉదాహరించారు. ఈ ప్రకరణలు ఒవైసీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడానికి ఉపకరిస్తాయని ఆమె స్పష్టం చేశారు.


ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలు.. జూన్ 25వ తేదీన ప్రమాణం చేశారు. ఈ ప్రమాణంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. జై బీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సభలోని పలువురు కేంద్ర మంత్రులతోపాటు వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ప్రొటెం స్పీకర్ స్థానంలో ఉన్న రాధా మోహన్ సింగ్ స్పందించారు. ఒవైసీ చేసిన వ్యాఖ్యలను పరిశీలించి రికార్డుల నుంచి తొలగిస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.


మరోవైపు ఎంపీ ఒవైసీ వ్యాఖ్యలపై గోవాలోని హిందు నాయకులు నుంచి నిరసనలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఆ క్రమంలో ఒవైసీపై తక్షణమే అనర్హత వేటు వేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. అందులోభాగంగా దక్షిణ గోవాలోని పొండా తాలుకలో జరిగిన 12వ విష్వక్ హిందూ రాష్ట్ర మహోత్సవంలో.. ఒవైసీనపై అనర్హత వేటు వేయాలని తీర్మానం కూడా చేశారు. 102 డి ప్రకరణ ప్రకారం అసదుద్దీన్ ఒవైసీపై అనర్హత వేటు వేయవచ్చని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 27 , 2024 | 06:17 PM