Share News

Bomb scare in Delhi: ఈ సారి ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

ABN , Publish Date - May 12 , 2024 | 05:47 PM

న్యూఢిల్లీలోని బురారీ, సంజయ్ గాంధీ ఆసుపత్రులకు ఆదివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, క్లూస్ టీం ఆ యా ఆసుపత్రులకు చేరుకున్నాయి.

Bomb scare in Delhi: ఈ సారి ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

న్యూఢిల్లీ, మే 12: న్యూఢిల్లీలోని బురారీ, సంజయ్ గాంధీ ఆసుపత్రులకు ఆదివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, క్లూస్ టీం ఆ యా ఆసుపత్రులకు చేరుకున్నాయి. ఆ క్రమంలో ఆసుపత్రుల్లోని సిబ్బందిని, రోగులను బయటకు పంపి.. ముమ్మర తనిఖీలు చేపట్టారు.

LokSabha Elections: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. 10 గ్యారంటీలు ప్రకటించిన కేజ్రీవాల్


Congress Party: ఖర్గే హెలికాఫ్టర్‌లో తనిఖీలు..

ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు అందినట్లు ఆసుపత్రి వర్గాలు.. తమ ఫిర్యాదులో పేర్కొన్నాయి. అయితే ఇటీవల జైపూర్, గోవా, నాగ్‌పూర్ విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

ఆ కొద్ది రోజులకే ఢిల్లీలోని పలు పాఠశాలలకు సైతం బాంబు బెదిరింపులు అందాయి. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నాు. మరోవైపు సార్వత్రికి ఎన్నికలు జరుగుతున్నాయి.

Mothers Day: అమ్మ పాత్ర ఎప్పటికీ నిత్య నూతనమే


అలాంటి వేళ.. ఇలా బాంబు బెదిరింపులు.. అదీ కూడా విమానాశ్రయాలు, పాఠశాలలు, ఆసుపత్రులే లక్ష్యంగా చేసుకొని రావడంతో.. ప్రజల్లో కలవరం వ్యక్తమవుతుంది.

Read Latest National News And Telugu News

Updated Date - May 12 , 2024 | 05:48 PM