Bomb threats in malls: డీఎల్‌ఎఫ్ మాల్‌కు బాంబు బెదిరింపు.. జనం బెంబేలు
ABN , Publish Date - Aug 17 , 2024 | 04:05 PM
నొయిడాలోని డీఎల్ఎఫ్ మాల్ లో బాంబు పెట్టినట్టు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్ రావడం శనివారం ఉదయం తీవ్ర కలకలం సృష్టించింది. సమాచారం అందిన వెంటనే పోలీసు టీమ్, అగ్నిమాపక దళాలు, డాగ్ స్క్వాడ్ హుటాహుటిన అక్కడకు చేరుకుని మాల్స్‌లోని విజిటర్లు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించారు.
న్యూఢిల్లీ: నొయిడా (Noida)లోని డీఎల్ఎఫ్ మాల్ (DLF Mall)లో బాంబు పెట్టినట్టు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్ రావడం శనివారం ఉదయం తీవ్ర కలకలం సృష్టించింది. సమాచారం అందిన వెంటనే పోలీసు టీమ్, అగ్నిమాపక దళాలు, డాగ్ స్క్వాడ్ హుటాహుటిన అక్కడకు చేరుకుని మాల్స్‌లోని విజిటర్లు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించారు. సినిమా స్క్రీనింగ్‌ను మధ్యలోనే నిలివేసి అనంతరం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
బాంబు బెదిరింపు కాదు, మాక్ డ్రిల్...
కాగా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు షాపింగ్ మాల్క్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయన్న వార్తలపై నొయిడా పోలీసులు వివరణ ఇచ్చారు. ఎలాంటి బాంబు బెదిరింపులు రాలేదని, రెగ్యులర్‌గా జరిపే సెక్యూరిటీ డ్రిల్స్ జరిపామని నొయిడా డీసీపీ రామ్ బదన్ సింగ్ తెలిపారు. డీఎల్‌ఎఫ్ మాల్‌లో ఈ సెక్యూరిటీ డ్రిల్ జరిపినట్టు ఆయన చెప్పారు. పెద్ద ఏరియాల్లో ఇలాంటి సెక్యూరిటీ డ్రిల్స్ జరపడం వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగక్కుండా చూడవచ్చని, తాము జరిపిన మాక్ డ్రిల్స్‌లో అగ్నిమాపక సిబ్బంది, డాగ్ స్క్వాడ్, పోలీసు టీమ్‌లు పాల్గొన్నట్టు వివరించారు.
Lucknow: ఎయిర్‌పోర్ట్‌లో రేడియో ధార్మిక పదార్ధాల కలకలం..రంగంలోకి ఎన్‌డీఆర్ఎఫ్
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని డీఎల్‌ఎల్ మాల్ ఆఫ్ ఇండియాలో ఒక మల్టీప్లెక్స్ సినిమా హాల్, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్, ఫుడ్ జోన్ తదితర మాల్స్ ఉన్నాయి. లీడింగ్ బ్రాండ్ హౌస్‌లు, ఫుట్ వేర్, స్పోర్ట్ వేర్, సెలూన్లు వంటి దుకాణాలు సైతం ఉన్నాయి. కాగా, ఢిల్లీలోని డీఎల్‌ఎఫ్ ప్రోమేనేడ్, గురుగావ్‌లోని ఆంబియన్స్ మాల్‌కు కూడా శనివారంనాడు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ అక్కడకు చేరుకుని మాల్స్‌లోని జనాలను సురక్షితంగా బయటకు పంపించారు. తనిఖీలు చేపట్టారు.
Read More National News and Latest Telugu News