Share News

మైనర్‌ భార్యతో శృంగారం అత్యాచారమే

ABN , Publish Date - Nov 16 , 2024 | 03:30 AM

మైనర్‌ బాలికతో శృంగారం జరపడం అత్యాచారం కిందకే వస్తుందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.

 మైనర్‌ భార్యతో శృంగారం అత్యాచారమే

ముంబై, నవంబరు 15: మైనర్‌ బాలికతో శృంగారం జరపడం అత్యాచారం కిందకే వస్తుందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఆమె సొంత భార్యే అయినప్పటికీ, శృంగారానికి అంగీకారం తెలిపినప్పటికీ చెల్లదని తెలిపింది. 18 ఏళ్లు నిండని బాలికతో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరమని, అందువల్ల మైనర్‌ భార్యతో పరస్పర సమ్మతితో జరిపిన శృంగారాన్ని కూడా రేప్‌గానే పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ గోవింద్‌ సనప్‌ తీర్పు చెప్పారు. దీన్ని అత్యాచారం కింద గుర్తిస్తూ పోక్సో చట్టం కింద ఓ భర్తకు శిక్ష వేస్తూ వార్దా జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించారు. భార్యతో జరిపే శృంగారం నేరం ఎలా అవుతుందంటూ నిందితుడు చేసిన వాదనను తిరస్కరించారు. నిందితుడు తన భార్య(మైనర్‌)ను గర్భస్రావం చేయించుకోవాలని వేధించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు కోర్టుకు వెళ్లింది.

Updated Date - Nov 16 , 2024 | 03:30 AM