Home » Bombay High Court
మైనర్ బాలికతో శృంగారం జరపడం అత్యాచారం కిందకే వస్తుందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.
అత్తింటి వారు కోడలిని టీవీ చూడనీయకపోవడం, చాపపై పడుకోమనడం, పొరుగు వారిని కలవనీయకపోవడం వంటివి క్రూరత్వం కిందకు రావని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో అమల్లోకి తెచ్చిన ఐటీ రూల్స్‌ను బాంబే హైకోర్టు కొట్టేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు ఉద్దేశించిన ఐటీ రూల్స్ రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంది.
ముంబై లోకల్ రైల్వే స్టేషన్లలో జరిగిన ప్రమాదాలపై జతిన్ యాదవ్ అనే వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశారు. లోకల్ ట్రైన్స్ వల్ల ఎంతమంది చనిపోయారో తెలియజేయాలని బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం.. సమాచారం ఇవ్వాలని రైల్వేశాఖను ఆదేశించింది.
మూడు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై పాఠశాలలో స్వీపర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. ఈ కేసును గురువారం సుమోటోగా విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు..
మహారాష్ట్రలో బద్లాపూర్ ఘటనపై నిరసనలు కొనసాగుతుండగానే.. ముంబైలో మరో బాలికపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.
కళాశాల క్యాంపస్‌లలో విద్యార్థులు హిజాబ్‌లు ధరించడాన్ని నిషేధిస్తూ ముంబయికి చెందిన ఓ ప్రైవేట్ కాలేజీ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.
కళాశాల ఆవరణల్లో హిజాబ్ ధారణపై నిషేధం విధించడం సబబేనని బుధవారం బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. ఏకరూప వస్త్రధారణ దృష్ట్యా విద్యార్థులు హిజాబ్, బుర్ఖా, నకాబ్, టోపీలను ధిరించకుండా నిషేఽధం విధించవచ్చని తెలిపింది.
బాల్య వివాహ బాధితురాలికి గర్భవిచ్చిత్తికి అనుమతిస్తూ బాంబే హైకోర్టు(Bombay High Court) సంచలన తీర్పునిచ్చింది. పిండంలో జన్యుపరమైన సమస్యలు ఉండటంతో కోర్టు ఈ తీర్పు వెలువరించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల బాలికకు 2022లో బాల్యవివాహం జరిగింది.
అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమైన మాజీ భర్తకు నెలవారీ భరణం కింద రూ.10వేలు చెల్లించాల్సిందేనని ఓ మహిళను బాంబే హైకోర్టు(Bombay High Court) ఆదేశించింది. గురువారం ఇందుకు సంబంధించి కీలక తీర్పు వెలువరించింది. హిందూ వివాహ చట్టంలోని నిబంధనల్లో భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైందని చెబుతారని జస్టిస్ షర్మిలా దేశ్ముఖ్తో కూడిన సింగిల్ బెంచ్ పేర్కొంది.