Share News

జగ్జీత్‌ పేరుతో మా సైన్యంలో ఎవరూ లేరు: బ్రిటన్‌

ABN , Publish Date - Dec 26 , 2024 | 05:53 AM

పంజాబ్‌లోని గురుదా్‌సపూర్‌లో ఇటీవల ఓ పోలీసు పోస్టుపై జరిగిన ఉగ్రదాడి వెనుక బ్రిటిష్‌ సైనికుడు జగ్జీత్‌ సింగ్‌ హస్తం ఉందన్న ఆ రాష్ట్ర పోలీసుల ప్రకటనను బ్రిటన్‌ ఖండించింది.

జగ్జీత్‌ పేరుతో మా సైన్యంలో ఎవరూ లేరు: బ్రిటన్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 25: పంజాబ్‌లోని గురుదా్‌సపూర్‌లో ఇటీవల ఓ పోలీసు పోస్టుపై జరిగిన ఉగ్రదాడి వెనుక బ్రిటిష్‌ సైనికుడు జగ్జీత్‌ సింగ్‌ హస్తం ఉందన్న ఆ రాష్ట్ర పోలీసుల ప్రకటనను బ్రిటన్‌ ఖండించింది. జగ్జీత్‌ సింగ్‌ పేరుతో తమ సైన్యంలో ఎవరూ లేరని పేర్కొంది. ఈ మేరకు బ్రిటన్‌ రక్షణశాఖ ప్రతినిధి రియాన్‌ షిల్లాబీర్‌ ఓ ప్రకటన చేశారు. ఈ ఘటనకు సంబంధించి తమను భారత అధికారులెవరూ సంప్రదించలేదని తెలిపారు. మరోవైపు, దర్యాప్తు అధికారుల ప్రకటనకు తాము కట్టుబడి ఉన్నామని పంజాబ్‌ డీజీపీ గౌరవ్‌ యాదవ్‌ వెల్లడించారు. ఈ కేసు వ్యవహారాన్ని సంబంధిత అధికారుల ద్వారా బ్రిటన్‌ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు.

Updated Date - Dec 26 , 2024 | 05:53 AM