Cabinet Meeting: కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు
ABN , Publish Date - Oct 03 , 2024 | 09:18 PM
దేశంలోని 11,72,240 మంది రైల్వే ఉద్యోగుల కోసం మొత్తం రూ. 2,028.57 కోట్లతో ఉత్పాదకత లింక్డ్ బోనస్ (PLB) చెల్లింపునకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. సిబ్బంది అద్భుతమైన పనితీరును గుర్తించి వారిని ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 03: దేశంలోని 11,72,240 మంది రైల్వే ఉద్యోగుల కోసం మొత్తం రూ. 2,028.57 కోట్లతో ఉత్పాదకత లింక్డ్ బోనస్ (PLB) చెల్లింపునకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. సిబ్బంది అద్భుతమైన పనితీరును గుర్తించి వారిని ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం న్యూఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్బంగా తీసుకున్న కీలక నిర్ణయాలకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
Also Read: Konda Surekha: నేను మాట్లాడింది తప్పే.. కానీ అతడిని తెలంగాణలో తిరగనీయ్యం
Also Read: HIBOX Mobile APP: హైబాక్స్ సిండికేట్ కేసులో ఐదుగురికి సమన్లు జారీ చేసిన పోలీసులు
అలాగే 'నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్'కు ఆమోదం తెలిపిందన్నారు. రూ.10,103 కోట్లతో నూనె గింజల ఉత్పత్తి చేయాలని నిర్ణయించిందని చెప్పారు. ఇక వంట నూనెల విషయంలో విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు.
Also Read: Konda Surekha: కొండా సురేఖపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
Also Read: Dasara NavaRatri 2024: ఈ సమయంలో ఏమి తినాలి.. ఏం తినకూడదంటే.. ?
నేషనల్ మిషన్ ఏడేళ్ల పాటు అమలు కానుందని చెప్పారు. తమిళనాడు రాజధాని చెన్నైలో 118.9 కి.మీ మేర 128 స్టేషన్లతో నిర్మించనున్న చెన్నై మెట్రో ఫేజ్-2కు కేంద్ర మంత్రి వర్గం పచ్చ జెండా ఊపిందని చెప్పారు. ఈ మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 63,246 కోట్లుగా కేంద నిర్ణయించిందని వివరించారు.
Also Read: Pawan kalyan: మీరు చేసిన పాపాలు ఏమిటో ఆ స్వామి వారే చెబుతారు
Also Read: Dasara Navaratri 2024: రేపు శుక్రవారం.. విశేషమేమంటే..
ఫేజ్-2లో భాగంగా ఉత్తరం నుంచి దక్షిణానికి, తూర్పు నుంచి పడమరకు మొత్తం 3 మెట్రో కారిడార్లు నిర్మించాలని.. అవి మాధవరం నుంచి సిప్కాట్ (SIPCOT) వరకు, లైట్ హౌస్ నుంచి పూనమల్లీ బైపాస్ వరకు, మాధవరం నుంచి శోలింగనూర్ వరకు ఈ కారిడార్లను విస్తరిస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
Also Read: Pawan Kalyan: సనాతన ధర్మంపై దాడి చేస్తే.. సత్తా చూపిస్తాం
For National News And Telugu News...