UP Cop Demote: ఇంట్లో నుంచి వెళ్లిన కాప్.. మహిళ కానిస్టేబుల్‌తో ఏకాంతంగా..
ABN , Publish Date - Jun 23 , 2024 | 09:55 AM
మూడేళ్ల క్రితం ఉన్నావ్ బిఘాపూర్ సర్కిర్ ఆఫీసర్‌గా కృష శంకర్ ఉండేవారు. ఆ సమయంలో ఇంట్లో గొడవ జరిగింది. ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు. స్టేషన్‌లో మాత్రం సెలవు పెట్టారు. వెళ్లిన తర్వాత ఆఫీసు, హోమ్ రెండు మొబైల్స్ స్విచాఫ్ చేశారు. భర్తకు ఏం జరిగిందోనని భయపడి అతని భార్య ఎస్పీని ఆశ్రయించింది. శంకర్ ఆచూకీ కనుగొనేందుకు పోలీసుల బృందాలు రంగంలోకి దిగాయి. చివరి లోకేషన్ ఆధారంగా కన్పూర్‌లో ఓ హోటల్‌లో ఉన్నట్టు గుర్తించారు.
ఉన్నత స్థానంలో ఉండే కొందరు చేసే పనులు వారికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. ఉన్న మంచి పేరు పోతుంది. అధికారులకు డిమోషన్ తప్పనిసరి. ఉత్తరప్రదేశ్‌లో ఓ అధికారికి ఇలానే జరిగింది. భార్యతో గొడవలు అని, తన సహోద్యోగితో కలిసి ఉన్నాడు. ఇంకేముంది అతనిని ట్రేస్ చేశారు. ఇద్దరు రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో విచారణ చేపట్టారు.
ఏంటంటే..?
మూడేళ్ల క్రితం ఉన్నావ్ బిఘాపూర్ సర్కిర్ ఆఫీసర్‌గా కృష శంకర్ ఉండేవారు. ఆ సమయంలో ఇంట్లో గొడవ జరిగింది. ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు. స్టేషన్‌లో మాత్రం సెలవు పెట్టారు. వెళ్లిన తర్వాత ఆఫీసు, హోమ్ రెండు మొబైల్స్ స్విచాఫ్ చేశారు. భర్తకు ఏం జరిగిందోనని భయపడి అతని భార్య ఎస్పీని ఆశ్రయించింది. శంకర్ ఆచూకీ కనుగొనేందుకు పోలీసుల బృందాలు రంగంలోకి దిగాయి. చివరి లోకేషన్ ఆధారంగా కన్పూర్‌లో ఓ హోటల్‌లో ఉన్నట్టు గుర్తించారు.
మహిళ కాప్‌తో ఏకాంతంగా..
హోటల్ గదిలోకి పోలీసులు వెళ్లి చూశారు. గదిలో మహిళ కానిస్టేబుల్‌తో శంకర్ ఏకాంతంగా ఉన్నారు. వారు ఇద్దరు గదిలో ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజీ కూడా ఉంది. ఘటనపై విచారణ చేపట్టారు. ఉన్నత అధికారి మహిళ కానిస్టేబుల్‌తో ఏకాంతంగా గడపటాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. సర్వీస్‌లో డిమోట్ చేశారు. డీఎస్పీ నుంచి కానిస్టేబుల్‌గా మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
na