Share News

ఔషధ కొనుగోళ్లలో సందీప్‌ ఘోష్‌ మోసాలు

ABN , Publish Date - Sep 22 , 2024 | 02:55 AM

ఆర్జీకర్‌ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ ఔషధ కొనుగోళ్లలో భారీ అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది.

ఔషధ కొనుగోళ్లలో సందీప్‌ ఘోష్‌ మోసాలు

  • 42 రోజుల తర్వాత బెంగాల్‌లో జూడాల పాక్షిక హాజరు

కోల్‌కతా, సెప్టెంబరు 21: ఆర్జీకర్‌ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ ఔషధ కొనుగోళ్లలో భారీ అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది. బయట ఏజెన్సీల నుంచి మందుల కొనుగోళ్లు జరిగినట్లు గుర్తించింది. బిడ్డర్ల ప్రక్రియలో నైపుణ్యాల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేయకుండా నిబంధనలను అడ్డగోలుగా ఉల్లంఘించినట్లు పేర్కొంది. చాలా సందర్భాల్లో తక్కువ ధరకు కోట్‌ చేయడంతో అర్హత లేని బిడ్డర్లకు టెండర్లను కేటాయించారని, దీనిని గుర్తించి ఆర్జీకర్‌ యంత్రాంగం అప్రమత్తం చేసినా ఘోష్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలుస్తోంది. కాగా 42 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత బెంగాల్‌లో జూనియర్‌ వైద్యులు ఆందోళనలను విరమించారు. శనివారం పాక్షికంగా విధులకు హాజరయ్యారు.

Updated Date - Sep 22 , 2024 | 02:57 AM