Home » Kolkata doctor rape-murder case
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన ట్రైయినీ వైద్యురాలి తండ్రి లేఖ రాశారు. తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని విజ్జప్తి చేశారు. తమ కోసం కొన్ని నిమిషాలు కేటాయించాలంటూ అమిత్ షాను అభ్యర్థించారు.
కోల్‌కతా ఆర్జీ కార్ ఆస్పత్రి, వైద్య కళాశాల ట్రెయినీ డాక్టర్ హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్(33)పై సీబీఐ కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టులో సోమవారం 45 పేజీల చార్జిషీట్ దాఖలు చేసింది.
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న ట్రైయినీ వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యాచారానికి సంజయ్ రాయ్ పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది. అందుకు సంబంధించిన అభియోగ పత్రాన్ని సోమవారం సల్దాలోని ప్రత్యేక కోర్టులో సీబీఐ దాఖలు చేసింది.
ఈ ఏడాది ఆగస్ట్ 9వ తేదీన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ట్రైయినీ వైద్యురాలికి న్యాయం చేయలని.. అలాగే పని ప్రదేశాల్లో తమకు రక్షణ కల్పించాలంటూ వైద్య సిబ్బంది దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైయినీ వైద్యురాలి హత్యాచార కేసు.. అనంతరం జరిగిన చర్చల్లో తమ డిమాండ్లు నెరవేర్చడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై జూనియర్ డాక్టర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ క్రమంలో మంగళవారం వారు మరోమారు నిరవధిక ఆందోళనకు దిగారు.
హత్యాచారానికి గురైన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైయినీ వైద్యురాలి ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని సోషల్ మీడియాలో వైరల్ కాకుండా ఉండేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఆర్జీకర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఔషధ కొనుగోళ్లలో భారీ అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది.
వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లు.. మమత బెనర్జీ ప్రభుత్వంతో జరిపిన చర్చలు దాదాపుగా ఫలప్రదమయ్యాయి. దాంతో 42 రోజుల పాటు సాగిన జూనియర్ డాక్టర్ల ఆందోళన శుక్రవారంతో ముగిశాయి. దీంతో నేటి నుంచి వారు విధులకు హాజరుకానున్నారు. అత్యవసర సేవలతోపాటు అవసరమైన సేవల్లో మాత్రమే వారు పాల్గొనున్నారు.
2021 నుంచి ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. సందీప్ ఘోష్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని హత్యాచారానికి గురైన ఆ కాలేజీ వైద్యురాలి తండ్రి వెల్లడించారు. ఆ నాడే ప్రొ. సందీప్ ఘోష్‌పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కఠిన చర్యలు తీసుకుని ఉంటే.. ఈ రోజు తమ కుమార్తె బతికి ఉండేదన్నారు.
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలపై ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. సందీప్ ఘోష్ ఫామ్ హౌస్‌పై ఈడీ సోదాలు చేపట్టింది. అలాగే అధికార టీఎంసీ ఎమ్మెల్యే సుదీప్ రాయ్ నివాసంలో సైతం ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ రెండు ప్రదేశాల్లో ఈడీ ఏక కాలంలో దాడులు చేసింది. ఎమ్మెల్యే రాయ్.. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.