Share News

Central: భద్రతా సలహాదారుగా మళ్లీ అజిత్‌ దోభాల్‌

ABN , Publish Date - Jun 14 , 2024 | 04:32 AM

జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్‌ దోభాల్‌ వరుసగా మూడోసారి నియమితులయ్యారు. దీనికి సంబంధించి కేంద్రం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Central: భద్రతా సలహాదారుగా మళ్లీ అజిత్‌ దోభాల్‌

న్యూఢిల్లీ, జూన్‌ 13: జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్‌ దోభాల్‌ వరుసగా మూడోసారి నియమితులయ్యారు. దీనికి సంబంధించి కేంద్రం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఐపీఎస్‌ అధికారి అయిన దోభాల్‌ను మోదీ ప్రభుత్వం తొలిసారి 2014లో ఆ పదవిలో నియమించింది. 2019లో తిరిగి నియమితులైన ఆయన పదవీకాలం ఇటీవల పూర్తి కావడంతో కేంద్రం ఆయన్నే కొనసాగించాలని నిర్ణయించింది.

Updated Date - Jun 14 , 2024 | 04:35 AM