Share News

Champai Soren: నేను ఎక్కడ ఉన్నానో అక్కడే ఉన్నా... బీజేపీలో చేరిక వదంతులపై మాజీ సీఎం

ABN , Publish Date - Aug 17 , 2024 | 08:16 PM

జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం సీనియర్ నేత చంపయీ సోరెన్ బీజేపీలో చేరనున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన తొలిసారి స్పందించారు. ''నేను ఎక్కడున్నానో అక్కడే ఉన్నా'' అని బదులిచ్చారు.

Champai Soren: నేను ఎక్కడ ఉన్నానో అక్కడే ఉన్నా... బీజేపీలో చేరిక వదంతులపై మాజీ సీఎం

రాంచీ: జార్ఖాండ్ (Jharkhand) అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం సీనియర్ నేత చంపయీ సోరెన్ (Champai Soren) బీజేపీలో చేరనున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన తొలిసారి స్పందించారు. ''నేను ఎక్కడున్నానో అక్కడే ఉన్నా'' అని బదులిచ్చారు.


''ఎలాంటి వదంతులు వ్యాప్తిలో ఉన్నాయో నాకు తెలియదు. ఎలాంటి వార్తలు నడుస్తున్నాయో అసలు తెలియదు. అందువల్ల అవి నిజమో కాదో చెప్పలేను. వాటి గురించి నాకేమీ తెలియదు'' అని చంపయీ సోరెన్ చెప్పారు. ''నేను ఎక్కడున్నానో అక్కడే ఉన్నాను'' (హమ్ జహా పర్ హై వహీ పర్ హై) అని సమాధానమిచ్చారు. దీనికి ముందు, చంపయీ సోరెన్ కొందరు జేఎంఎం నేతలతో కలిసి అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీలో చేరనున్నారని, ఆ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేస్తారని వదంతులు వినిపించాయి. ఈ విషయమై అమిత్‌షాను కలుసుకునేందుకు కొందరు జేఎంఎం నేతలు ఢిల్లీ వెళ్లారనే ప్రచారం కూడా జరిగింది.

Kolkata rape-murder protest: 43 మంది డాక్టర్లపై మమత సర్కార్ బదిలీ వేటు


మనీలాండరింగ్ కేసులో జనవరి 31న జేఎంఎం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేయడానికి ముందే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో చంపయీ సోరెన్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఐదు నెలల పాటు జైలులో ఉన్న హేమంత్ సోరన్ హైకోర్టు ఇచ్చిన బెయిలుపై ఇటీవల బయటకు రాగానే తిరిగి శానససభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. చంపయీ సోరెన్ రాజీనామాతో తిరిగి సీఎం పగ్గాలు చేపట్టారు. హేమంత్ మంత్రివర్గంలో ప్రస్తుతం జలవనరుల శాఖ మంత్రిగా చంపయీ సోరెన్ ఉన్నారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 17 , 2024 | 08:16 PM