Share News

Cheetah: అర్ధరాత్రి చిరుత పరుగులు.. సీసీ కెమెరాల్లో నమోదు

ABN , Publish Date - Apr 04 , 2024 | 11:38 AM

మైలాడుదురై జిల్లా కూరైనాడు సెమ్మం గుళం సమీపంలో బుధవారం అర్ధరాత్రి చిరుత(Cheetah) పరుగులు తీయడాన్ని పాదచారులు బిత్తరపోయారు. వెంటనే పోలీసులు, అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Cheetah: అర్ధరాత్రి చిరుత పరుగులు.. సీసీ కెమెరాల్లో నమోదు

చెన్నై: మైలాడుదురై జిల్లా కూరైనాడు సెమ్మం గుళం సమీపంలో బుధవారం అర్ధరాత్రి చిరుత(Cheetah) పరుగులు తీయడాన్ని పాదచారులు బిత్తరపోయారు. వెంటనే పోలీసులు, అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. హుటా హుటిన అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో సీసీ కెమెరా(CC camera)ల్లో నమోదైన వీడియో దృశ్యాలు పరిశీలించారు. అందులో ఓ చిరుత వీధి కుక్కలను తరుముకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆ రహదారి పక్కగా చిరుత కాలి ముద్రలు నమోదై ఉండటాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్‌ మహాభారతి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ ప్రాంతానికి చేరువుగా ఉన్న ఓ ప్రైవేటు స్కూలుకు సెలవు ప్రకటించారు. అటవీ శాఖాధికారులు మాట్లాడుతూ వేసవి ప్రారంభం కావడంతో తాగునీటి కోసం వచ్చి ఉంటుందన్నారు.

ఇదికూడా చదవండి: PM Modi: 3 రోడ్‌షోలు.. 3 బహిరంగ సభలు.. నాలుగు రోజులపాటు మోదీ ప్రచారం

nani3.2.jpg

Updated Date - Apr 04 , 2024 | 11:46 AM